బ్రెజిల్లో భారీ వర్షాల కారణంగా రహదారులపై వరద నీరు నిలిచిపోయింది. అయితే, ఆ నీటిలో దాక్కున్న ఓ భారీ మొసలి బైక్‌పై వెళ్తున్న వ్యక్తిపై ఒక్కసారిగా దాడికి ప్రయత్నించడం కలకలం రేపింది. ఈ భయానక ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
బ్రెజిల్‌లోని రియో డి జనీరో నగర పరిధిలో ఉన్న తకువారా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గత శనివారం కురిసిన భారీ వర్షాల కారణంగా అవుటీరో శాంటో రోడ్డుపై పెద్దఎత్తున వరద నీరు నిలిచిపోయింది.
ఈ క్రమంలో ఆ రహదారిపై బైక్‌తో వెళ్తున్న ఓ డెలివరీ ఉద్యోగిని నీటిలో దాక్కున్న మొసలి అకస్మాత్తుగా లక్ష్యంగా చేసుకుంది. బైక్ వైపు వేగంగా దూసుకొచ్చి కాటు వేయడానికి ప్రయత్నించింది. అయితే, ప్రమాదాన్ని గమనించిన ఆ వ్యక్తి వెంటనే అప్రమత్తమై అక్కడి నుంచి తప్పించుకున్నాడు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మొసలిని సురక్షితంగా పట్టుకుని, దాని సహజ ఆవాసంలోకి తరలించారు. మొసలికి కూడా ఎలాంటి గాయాలు కాలేదని కథనంలో పేర్కొన్నారు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. అదృష్టవశాత్తూ బైక్ నడుపుతున్న వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు. వరద నీటిలో ప్రమాదకరమైన జంతువులు ఉండే అవకాశం ఉందని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.

Leave a Reply