వాట్సాప్‌లో వచ్చే అనుమానాస్పద మెసేజ్‌లకు ‘NO’ అని సమాధానం ఇవ్వడం ద్వారా కూడా బ్యాంక్ ఖాతాలోని డబ్బు మొత్తాన్ని పోగొట్టుకునే ప్రమాదం ఉందన్న దిగ్భ్రాంతికర విషయం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది.
సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు కూడా ‘ఆటో ఎగ్జిక్యూషన్ ఫైల్ అటాక్’ (Auto Execution File Attack) వంటి ప్రమాదకరమైన పద్ధతులను వాడుతున్నారు. బ్యాంకు ఖాతా నుంచి డబ్బు డ్రా అయినట్లు నకిలీ మెసేజ్‌లు పంపి, ప్రజలను ఆందోళనకు గురిచేసి మోసాలకు పాల్పడుతున్నారు.
బాధితుల ఫోన్‌కు వచ్చే మెసేజ్‌లలో: “ఈ లావాదేవీ మీరు చేయనట్లయితే, వెంటనే ‘NO’ అని రిప్లై ఇవ్వండి” అని రాసి ఉంటుంది. దీన్ని నిజమని నమ్మి కంగారులో ప్రజలు ‘NO’ అని రిప్లై పంపుతున్నారు.
ఇలా ‘NO’ అని రిప్లై ఇవ్వగానే, అందులో దాగి ఉన్న మాల్‌వేర్ స్క్రిప్ట్ (Malware script) పనిచేయడం మొదలుపెడుతుంది. కేవలం కొన్ని సెకన్లలోనే హ్యాకర్లు ఫోన్‌పై పూర్తి నియంత్రణను సాధిస్తారు.
ఒక్కసారి కూడా OTP చెప్పకపోయినా లేదా ఎలాంటి అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయకపోయినా.. కేవలం ఒక్క చిన్న సమాధానంతోనే జీవితకాల సంపాదన మొత్తం పోయే ప్రమాదం ఉంది. అందుకే ఇలాంటి మెసేజ్‌లను చూసి భయాందోళనలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.

Leave a Reply