వాట్సాప్ అప్‌డేట్: 14 పైసల చార్జీ వసూలు..!” వాట్సాప్‌లో రాబోతున్న పెద్ద మార్పు.. ఎవరు డబ్బులు చెల్లించాలి..??

వాట్సాప్ ఉపయోగిస్తున్న కోట్ల మంది వినియోగదారులకు అక్టోబర్ 1 నుంచి కొత్త మార్పు రాబోతోందన్న వార్తలు ప్రజల్లో తీవ్ర గందరగోళాన్ని సృష్టించాయి.

కానీ, ఈ మార్పు వల్ల సాధారణ వాట్సాప్ వినియోగదారులపై ఎలాంటి చార్జీలు పడవని, కాబట్టి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టమైంది.

నిజానికి, ఈ కొత్త చార్జీల విధానం వాట్సాప్ బిజినెస్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించే పెద్ద వ్యాపార సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది. ఎప్పటిలాగే స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవడానికి, సమాచారాన్ని పంచుకోవడానికి ఎలాంటి రుసుము ఉండదు.

ఇప్పటివరకు సంస్థలు తమ కస్టమర్లకు ఆర్డర్ కన్ఫర్మేషన్, డెలివరీ వివరాల వంటి సేవా సంబంధిత (సర్వీస్ బేస్డ్) మెసేజ్‌లను 24 గంటల్లోపు ఉచితంగా పంపగలిగేవి. కానీ, అక్టోబర్ 1 నుంచి ఇలాంటి నిర్దిష్ట సేవా మెసేజ్‌లకు కూడా ఆయా వ్యాపార సంస్థలు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

భారతదేశంలో ఈ సర్వీస్ మెసేజ్‌ల కోసం ఒక్కో మెసేజ్‌కు 11.5 పైసలు, దానికి 18% జీఎస్టీ (GST) అదనంగా కలిపి మొత్తంగా 14 పైసలు చార్జీగా నిర్ణయించారు. అదే సమయంలో, ప్రతి వ్యాపార సంస్థ బిజినెస్ అకౌంట్‌కు నెలకు మొదటి 1,000 సర్వీస్ మెసేజ్‌లను ఉచితంగానే అనుమతిస్తారు.

కాబట్టి, బ్యాంకుల నుంచి వచ్చే సమాచారం లేదా ఆన్‌లైన్ షాపింగ్ డెలివరీ మెసేజ్‌ల కోసం కస్టమర్లు (వినియోగదారులు) అదనంగా ఎలాంటి డబ్బూ చెల్లించాల్సిన అవసరం లేదు. “వాట్సాప్‌కు చార్జీ” అనేది వ్యాపార సంస్థలు పంపే మెసేజ్‌ల ఖర్చుకు సంబంధించిన మార్పే తప్ప, సామాన్య ప్రజల వాడకంలో ఎలాంటి మార్పూ లేదు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *