“వాట్సాప్ మెసేజ్‌లు చూసి మోసపోకండి.!” దీపావళికి ₹10, ₹20, ₹50 నోట్లు దొరకవా?!” ఆర్‌బీఐ జారీ చేసిందంటూ వైరల్ అవుతున్న సర్క్యులర్ వెనుక ఉన్న అసలు నిజం.!!

దీపావళి పండుగ సందర్భంగా 10, 20, 50 రూపాయల వంటి చిన్న నోట్లకు కొరత ఏర్పడిందంటూ సోషల్ మీడియా, వాట్సాప్‌లలో ఒక వార్త తీవ్రంగా ప్రచారం అవుతోంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జారీ చేసిందని చెబుతున్న ఆ సర్క్యులర్‌లో.. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకే చిన్న నోట్ల ముద్రణను తగ్గించామని, పండుగ అవసరాలకు ప్రజలు ముందుగానే సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.

అయితే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సమాచారం, రిజర్వ్ బ్యాంక్ పేరుతో షేర్ అవుతున్న ఆ సర్క్యులర్ పూర్తిగా అబద్ధమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టం చేసింది. చిన్న నోట్ల నిల్వ లేదా కొరత గురించి ఆర్‌బీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదని దీని ద్వారా రూఢి అయింది.

బ్యాంకులు, కరెన్సీకి సంబంధించిన ఇలాంటి వదంతులను (పుకార్లను), ధృవీకరించని వార్తలను ప్రజలెవరూ నమ్మవద్దని పీఐబీ హెచ్చరించింది.

అంతేకాకుండా, సోషల్ మీడియాలో ఆర్‌బీఐ పేరుతో ఎలాంటి సర్క్యులర్ వచ్చినా, దాన్ని నమ్మి ఇతరులకు షేర్ చేసే ముందు ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో దాని నిజానిజాలను సరిచూసుకోవాలని సూచించారు.

పండుగ సమయాల్లో ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ఇలాంటి వదంతులు వ్యాపించడం సహజం కాబట్టి, ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎలాంటి ఆధారాలు లేని వదంతులను ప్రచారం చేయకుండా, కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మి అప్రమత్తంగా వ్యవహరించడం అవసరం.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *