యూరప్‌లో నివసించడానికి ఎంత ఖర్చవుతుందో భారత్‌కు చెందిన యువ పారిశ్రామికవేత్త శివ్ ప్రతాప్ సింగ్ షేర్ చేసిన ఓ వీడియో కళ్లకు కట్టినట్లు చూపించింది.
స్పెయిన్‌లోని బార్సిలోనా నగరంలో ఆయన బస చేసిన మూడు పడకగదుల (3BHK) ఇంటికి గాను, కేవలం ఒక్క వారానికి సుమారు రూ.3.5 లక్షల అద్దె చెల్లించారు. ఈ మొత్తం విని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. భారత్‌లో కూడా ఇంటి అద్దెలు పెరిగిపోతున్నాయనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఆయన వీడియో సోషల్ మీడియాలో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
శివ్ ప్రతాప్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో, బార్సిలోనాలో తాను ఉన్న ఇంటిని మొత్తం తిప్పి చూపించారు. ముందుగా హాల్ (లివింగ్ రూమ్) చూపిస్తూ.. అక్కడున్న సోఫా, డైనింగ్ టేబుల్, టీవీని పరిచయం చేశారు. ఆ తర్వాత వంటగదిని చూపించారు. అక్కడ ఫ్రిజ్, స్టవ్ సహా రోజువారీ అవసరాలకు పనికొచ్చే వస్తువులన్నీ ఉన్నాయి. అయితే ఆహార పదార్థాలు, కిరాణా సరుకులను మాత్రం అక్కడ బస చేసేవారే స్వయంగా కొనుక్కోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
అనంతరం ఇంట్లోని మూడు బెడ్‌రూమ్‌లను, బాత్‌రూమ్‌లను చూపించారు. ప్రతి గదిలోనూ వస్తువులు పెట్టుకోవడానికి కబోర్డులు, తగినంత స్థలం ఉన్నాయి. ముఖ్యంగా ఆ ఇంటికి ఉన్న పెద్ద బాల్కనీ ఆయనను బాగా ఆకర్షించింది. అక్కడ దాదాపు 20 మంది కూర్చుని చిన్నపాటి గెట్-టుగెదర్ నిర్వహించుకునేంత స్థలం ఉందని ఆయన చెప్పారు. స్నేహితులతో సమయం గడపడానికి, టేబుల్ వేసుకుని కూర్చోవడానికి ఆ ప్రదేశం ఎంతో అనువుగా ఉందని వీడియోలో పేర్కొన్నారు.
వీడియో చివరిలో భారత్, యూరప్‌లలో జీవన వ్యయాలను పోల్చి మాట్లాడిన శివ్ ప్రతాప్ సింగ్.. భారత్‌లో ధరలు, ఇంటి అద్దెలు ఎక్కువగా ఉన్నాయని భావించేవారు, యూరప్‌లోని కొన్ని నగరాల్లో ఖర్చులు అంతకంటే ఎక్కువే ఉంటాయనే విషయాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. ఆయన పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. బార్సిలోనా ఏమీ చౌకైన నగరం కాదని కొందరు కామెంట్ చేయగా, ఆ ఇంటి పెద్ద బాల్కనీని మరికొందరు మెచ్చుకుంటున్నారు. వారానికి రూ.3.5 లక్షల అద్దె అనే విషయం ఇప్పుడు భారత్ మరియు యూరప్‌లలో జీవన వ్యయాలపై పెద్ద చర్చకు దారితీసింది.

Leave a Reply