హిందూ ధర్మంలో రావి చెట్టు పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది బ్రహ్మ, విష్ణు మరియు శివుల నివాస స్థలమని నమ్ముతారు. అయితే, ఈ చెట్టు మీ ఇంటి గోడలపై పెరుగుతున్నట్లయితే, దానిని వెంటనే తీసివేయాలి. ఎందుకంటే, ఇది ఇంటి గోడలపై పెరగడం అశుభం అని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి గోడలపై లేదా ఇంటి పైకప్పులపై (Roof) రావి మొక్కలు పెరగడం అశుభకరం. ఇది ఇంట్లోకి ధనం రాకుండా అడ్డుకోవడమే కాకుండా, ఇంట్లో ప్రతికూల శక్తిని (Negative Energy) పెంచుతుంది. ఇది దురదృష్టానికి కూడా కారణమవుతుంది. అందువల్ల, అటువంటి ఇంట్లో ఉండటం లేదా దానిని అద్దెకు తీసుకోవడం కూడా చాలా అశుభం అని పండితులు చెబుతున్నారు.
ఒక ఇంటిపై 48 కంటే ఎక్కువ రావి మొక్కలు పెరిగినట్లయితే, దానిని పెద్ద వాస్తు దోషంగా పరిగణిస్తారు. ఇది ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఒత్తిడి మరియు ఊహించని అడ్డంకులను కలిగిస్తుందని చెబుతారు. కాబట్టి, రావి మొక్కలు పెరుగుతున్న ఇంట్లో నివసించడం అనేక సమస్యలకు దారితీస్తుంది.
