ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో, ఆ దేశ ప్రధాని బెన్జమిన్ నెతన్యాహు ఫలితాలపై తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
కుడిపక్ష ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాకుండా నిరోధించడానికి విదేశీ శక్తులు కుట్ర పన్నాయని, వారి జోక్యం వల్లే తన కూటమికి పూర్తి మెజారిటీ దక్కలేదని ఆయన బహిరంగంగా ఆరోపించారు.
విదేశీ నిధులు తీసుకుని ప్రజలు అరబ్ పార్టీలకు ఓటు వేశారని నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ఎన్నికల ఫలితాల ప్రకారం, నెతన్యాహు నాయకత్వంలోని కుడిపక్ష కూటమి 53 స్థానాలను, ప్రధాన ప్రతిపక్ష కూటమి 48 స్థానాలను గెలుచుకున్నాయి. అదే సమయంలో, అరబ్ పార్టీలు 19 స్థానాలు సాధించి ప్రభుత్వం ఏర్పాటులో కీలక శక్తులుగా మారాయి.
ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కనీసం 61 స్థానాలు అవసరం. కానీ, ఏ కూటమికి కూడా స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో అక్కడ అనిశ్చితి నెలకొంది. కుడిపక్షాల బలాన్ని తగ్గించడానికే విదేశీ నిధులతో ఈ కుట్ర జరిగిందని నెతన్యాహు చేసిన ఆరోపణలు ఇప్పుడు ఇజ్రాయెల్ రాజకీయాలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
