“విద్యార్థితో శారీరక సంబంధం”: రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త.. పాఠశాల సెక్రటరీ బాగోతం వెలుగులోకి!

ముగ్గురు పిల్లల తల్లి అయిన అలీసియా హ్యూస్, వాలెంటైన్స్ డే రోజున 18 ఏళ్ల విద్యార్థితో ఏకాంతంగా ఉండటాన్ని ఆమె భర్త గమనించాడని నగర పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

అమెరికాలోని ఇండియానాలో ఒక పాఠశాల సెక్రటరీగా పనిచేస్తున్న ఈ మహిళ, ఉన్నత పాఠశాల విద్యార్థితో తనకు ఉన్న అక్రమ సంబంధంపై పోలీసులు విచారించినప్పుడు కన్నీళ్లు పెట్టుకుంది.

విచారణలో వెల్లడైన నిజాలు: 31 ఏళ్ల అలీసియా పోలీసులతో మాట్లాడుతూ.. ఆ విద్యార్థికి 18 ఏళ్లు నిండేవరకు తాను అతనితో శారీరక సంబంధం పెట్టుకోలేదని పేర్కొంది. అయితే, 17 ఏళ్ల వయసున్న మరో విద్యార్థితో కూడా ఆమెకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో కేసు నమోదైంది. దీనిపై అలీసియా స్పందిస్తూ.. “ఈ సంబంధం సమర్థించదగ్గది కాదని నాకు తెలుసు. కానీ నా భర్త నన్ను శారీరకవంగా, మానసికంగా వేధిస్తున్నాడు, అందుకే నేను ఇలా చేశాను” అని అధికారులకు తెలిపింది. ఇండియానా చట్టాల ప్రకారం, విద్యార్థులపై అధికారం ఉన్న హోదాలో ఉండి వారిని లైంగికంగా వేధించడం నేరం. ఆ 18 ఏళ్ల యువకుడితో కనీసం మూడుసార్లు కలిసున్నట్లు ఆమె అంగీకరించింది.

మరో విద్యార్థితో కూడా సంబంధం: “జనవరి చివరి వారం నుండి ఈ సంబంధం కొనసాగుతోంది. నేను అతనితో ఉండటం ఇది మూడోసారి” అని విచారణ వీడియోలో అలీసియా తెలిపింది. అయితే, విచారణలో భాగంగా పోలీసులు ఆమెకు, మరో 17 ఏళ్ల విద్యార్థికి మధ్య ఉన్న లైంగిక సంబంధానికి సంబంధించిన ఆధారాలను కనుగొన్నారు. ఆ విద్యార్థితో ఆమె కనీసం “ఐదు సార్లు” కలిసున్నట్లు దర్యాప్తు అధికారులు ధృవీకరించారు.

చట్టపరమైన చర్యలు: “మరే ఇతర విద్యార్థులతోనైనా మీకు సంబంధం ఉందా?” అని అధికారులు ప్రశ్నించగా, లేదని ఆమె సమాధానమిచ్చింది. ప్రస్తుతం అలీసియాను రాండాల్ఫ్ కౌంటీ జైలుకు తరలించారు. అక్కడ ఆమెకు $25,000 నగదు పూచీకత్తు (Bail) విధించారు. ఆమెపై మోపబడిన నేరాలు నిరూపితమైతే, ఆమెకు ఆరేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

మరోవైపు, అలీసియా భర్త బెయిలీ హ్యూస్ అప్పటికే విడాకుల కోసం దరఖాస్తు చేయడమే కాకుండా, తన ముగ్గురు పిల్లల సంరక్షణ బాధ్యతను (Custody) తనకు అప్పగించాలని కోర్టును కోరారు.


Posted

in

by

Tags: