విరార్: మద్యం మత్తులో పాముతో విన్యాసాలు చేసిన ఒక వ్యక్తి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. విరార్ వెస్ట్‌లోని నవాపూర్ ప్రాంతంలో 40 ఏళ్ల వ్యక్తి పామును ముద్దాడుతూ, ప్రమాదకరమైన స్టంట్లు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఏం జరిగింది? ముంబై ఆర్ న్యూస్ షేర్ చేసిన వీడియో ప్రకారం.. రాజు చందు బరద్ అనే వ్యక్తి పాము నోటిని ఒక చేత్తో పట్టుకుని, రెండు చేతులపై ఆడిస్తూ కనిపించాడు. ఈ క్రమంలో అతను పామును పదే పదే ముద్దాడాడు. ఎన్డీటీవీ మరాఠీ నివేదిక ప్రకారం, రాజు మద్యం మత్తులో ఉన్నప్పుడు ఆ పామును పట్టుకున్నాడు. చుట్టుపక్కల ఉన్నవారు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా అతను వినలేదు.
ఆ పాము రాజు చేతిపై కరవడంతో, అతడిని వెంటనే ఖరోడి ప్రాంతంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స ప్రారంభించేలోపే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. విరార్‌లోని అర్నాల పోలీస్ స్టేషన్లో ‘ప్రమాదవశాత్తు మరణం’గా కేసు నమోదైంది.
ముంబైలో మరో ఘటన: కొద్దిరోజుల క్రితం ముంబైలోని విలే పార్లే ఈస్ట్‌లో ఒక ఏడు అడుగుల జెర్రిపోతు (Indian Rat Snake) ఏసీ యూనిట్‌పై కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వన్యప్రాణి సంరక్షణ బృందం సకాలంలో స్పందించి, ఆ పాముకు ఎలాంటి హాని కలగకుండా సురక్షితంగా పట్టుకుని అడవిలో విడిచిపెట్టారు.
