తల్లిదండ్రుల ఆస్తిలో కుమార్తెలకు ఎంత మేర హక్కు ఉంటుంది? వివాహం చేసుకుని వేరే ఇంటికి వెళ్లిన కుమార్తెకు తన పుట్టింటి ఆస్తిపై అధికారం ఉందా? దీనిపై హిందూ వారసత్వ చట్టం ఏం చెబుతుందో చూద్దాం.
కుమార్తెలకు సమాన హక్కు! చాలా కుటుంబాల్లో ఆస్తి విషయంలో తలెత్తే ప్రధాన సందేహం ఇదే. కొడుకులతో సమానంగా కూతుళ్లకు హక్కు ఉందా అంటే.. ఖచ్చితంగా ఉంది. హిందూ అవిభక్త కుటుంబానికి (HUF) చెందిన పూర్వీకుల ఆస్తిలో (Ancestral Property) కొడుకులకు ఉన్నట్లే, కుమార్తెలకు కూడా పుట్టుకతోనే సమాన హక్కు ఉంటుంది.
2005 చట్ట సవరణ: 2005 నాటి హిందూ వారసత్వ చట్ట సవరణ ప్రకారం, కుమార్తెకు వివాహం జరిగిందా లేదా అనే సంబంధం లేకుండా తండ్రి ఆస్తిలో కొడుకుతో సమానమైన వాటా పొందే హక్కు ఉంది. ఆమెకు కూడా పుట్టుకతోనే ‘సహ భాగస్వామి’ (Coparcener) హోదా లభిస్తుంది.
విల్ (Will) రాయకుండా మరణిస్తే:
- ఒకవేళ తల్లి లేదా తండ్రి తమ స్వయంకృతాపిత ఆస్తిపై ఎటువంటి విల్లు రాయకుండా మరణిస్తే, ఆ ఆస్తి వారి సంతానానికి (కొడుకులు మరియు కుమార్తెలకు) సమానంగా పంపిణీ చేయబడుతుంది.
- తల్లి మరణిస్తే ఆమె ఆస్తిలో కొడుకు, కూతురు మరియు జీవించి ఉన్న భర్తకు సమాన వాటా ఉంటుంది.
- తండ్రి మరణిస్తే కొడుకు, కూతురు మరియు జీవించి ఉన్న భార్యకు సమాన వాటా లభిస్తుంది.
స్వయంకృతాపిత ఆస్తి (Self-acquired Property): తల్లిదండ్రులు తమ కష్టార్జితంతో సంపాదించిన ఆస్తిపై వారికి పూర్తి హక్కు ఉంటుంది. వారు దానిని విల్లు ద్వారా తమకు నచ్చిన వారికి రాసివ్వవచ్చు. ఒకవేళ తండ్రి తన సంపాదనను కేవలం కొడుకులకే రాసిస్తే, కుమార్తెలు అందులో చట్టబద్ధమైన హక్కును కోరలేరు.
మరువివాహం మరియు పిల్లల హక్కులు: భర్త విడాకులు తీసుకున్న తర్వాత మరువివాహం చేసుకున్నప్పటికీ, మొదటి భార్య పిల్లలకు తండ్రి యొక్క పూర్వీకుల ఆస్తిలో పూర్తి వాటా ఉంటుంది. వారి హక్కులకు ఎటువంటి భంగం వాటిల్లదు.
