వీడియో: ఆడపిల్ల పుట్టిందని ఆనందంతో ఆసుపత్రిలోనే చిందేసిన తండ్రి!

“పుణ్యం చేసుకున్న వారికి మాత్రమే ఆడపిల్ల పుడుతుంది”, “ఆడపిల్ల ఇంట్లో అడుగుపెట్టాలంటే నూరు జన్మల పుణ్యం ఉండాలి” – ఇలాంటి మాటలు మనం తరచూ వింటూనే ఉంటాం. అందుకే ఇంటికి మహాలక్ష్మి వచ్చిందనే వార్త తెలియగానే కుటుంబ సభ్యులంతా ఆనందంతో గంతులు వేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి.

అయితే, ఇక్కడొక తండ్రి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తనకు ఆడపిల్ల పుట్టిందని తెలియగానే ఆ తండ్రి ఆసుపత్రిలోనే డాన్స్ చేశాడు. “నేను తండ్రినయ్యాను.. అది కూడా ఆడపిల్లకు!” అన్న ఆయన ఉత్సాహం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

వైరల్ వీడియో వివరాలు: ‘Positive fan’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో షేర్ చేయబడింది. వీడియోలో ఆసుపత్రి దృశ్యాలు కనిపిస్తాయి. ఒక మహిళ అప్పుడే పుట్టిన పసికందును ఎత్తుకుని ఎంతో ఆనందంగా వస్తుండటం మనం చూడవచ్చు. ఆమె చుట్టూ ఉన్న మహిళలు కూడా సంతోషంతో డ్యాన్స్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఆ తండ్రి కూడా తన గారాల పట్టి పుట్టిన ఆనందంలో ఆసుపత్రి కారిడార్‌లోనే చిందేశాడు.

ఈ వీడియోకు ఇప్పటివరకు ఎనిమిది లక్షలకు పైగా వ్యూస్ లభించాయి. ఒక నెటిజన్ స్పందిస్తూ.. “ఈ రోజు నేను చూసిన అత్యుత్తమ దృశ్యం ఇది” అని వ్యాఖ్యానించారు. “జీవితంలో ఏదో పెద్ద విజయం సాధించిన అనుభూతి ఆయన నవ్వులో కనిపిస్తోంది” అని మరొకరు కామెంట్ చేశారు. “కూతురు పుట్టిన వేడుకను జరుపుకోవడం అందరికీ సాధ్యం కాదు,


Posted

in

by

Tags: