రైల్వే ప్లాట్‌ఫామ్‌పై ఆకలితో స్పృహ కోల్పోయి పడిపోయిన ఓ పేద తండ్రి.. పక్కనే ఏడుస్తున్న చిన్నారి.. ఈ దృశ్యం అక్కడున్న వారిని కలచివేసింది.
అయితే కొందరు అతడికి సహాయం చేయకుండా తమ ఫోన్లలో వీడియోలు తీస్తూ ఉండిపోయారు. అదే సమయంలో అక్కడున్న ఓ వ్యక్తి వెంటనే స్పందించి సహాయం చేసేందుకు ముందుకొచ్చాడు.
అతడు వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సిబ్బందికి సమాచారం అందించాడు. పోలీసులు అక్కడికి చేరుకుని స్పృహ కోల్పోయిన తండ్రికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అవసరమైన వైద్య సహాయం కూడా అందించారు.
ఆకలితో అలమటిస్తున్న తండ్రికి, ఏడుస్తున్న చిన్నారికి వెంటనే ఆహారం, తాగునీరు అందించారు. చలితో ఇబ్బంది పడుతున్న ఆ కుటుంబానికి అవసరమైన దుప్పట్లు కూడా అందించి అధికారులు అండగా నిలిచారు.
చుట్టూ ఉన్న కొందరు పరిస్థితిని వీడియో తీస్తూ ఉండగా.. సరైన సమయంలో స్పందించిన ఆ వ్యక్తి మానవత్వంతో వ్యవహరించిన తీరును పలువురు అభినందిస్తున్నారు. అతడు వెంటనే స్పందించకపోయి ఉంటే పరిస్థితి మరింత విషమంగా మారే అవకాశం ఉండేదని పలువురు పేర్కొంటున్నారు.
ఆపదలో ఉన్న వ్యక్తిని వీడియో తీయడం కంటే.. ముందుగా అతడికి సహాయం చేయడమే నిజమైన మానవత్వం అని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.
RPF సిబ్బంది, ఆ వ్యక్తి చేసిన సహాయక చర్యలకు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Leave a Reply