వీడియో: 25 రోజుల ముందే అజిత్ పవార్ మరణంపై జోస్యం? వైరల్ అవుతున్న జ్యోతిష్యుడి వీడియో!

మహారాష్ట్ర రాజకీయాల్లో బుధవారం అత్యంత విషాదకరమైన రోజుగా మిగిలిపోయింది. విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కన్నుమూయడంతో ఆయన అనుచరులు, కార్యకర్తల్లో తీవ్ర విషాదం నెలకొంది. అయితే, ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో హల్‌చల్ చేస్తోంది. 2026లో విమాన ప్రమాదాలు జరుగుతాయని ఒక జ్యోతిష్యుడు ఈ వీడియోలో జోస్యం చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

25 రోజుల ముందే జోస్యం?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక జ్యోతిష్యుడు ఇలా అన్నాడు: “భారతదేశంలో ఫిబ్రవరి మరియు మార్చి నెలల మధ్య విమాన ప్రమాదాలు జరుగుతాయి, ఇది ఖచ్చితంగా నిజమవుతుంది. నా పని చెప్పడం, వీలైతే మీరు ఆపుకోండి.” ఈ వీడియో జనవరి 2వ తేదీ ప్రాంతంలో రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. అజిత్ పవార్ ప్రమాదం సరిగ్గా అదే కాలంలో జరగడంతో, ఆయన మరణాన్ని ఈ జ్యోతిష్యుడు 25 రోజుల ముందే ఊహించాడని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

గుర్తుపట్టలేనంతగా మారిన మృతదేహం

బుధవారం జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్‌తో సహా ఐదుగురు మరణించారు. ఈ ప్రమాదం ఎంత భయంకరంగా జరిగిందంటే, అజిత్ పవార్ మృతదేహాన్ని ఆయన ధరించిన చేతి గడియారం ఆధారంగా గుర్తించాల్సి వచ్చిందని సమాచారం. ఇది ఆ ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది.

నెటిజన్ల స్పందన

‘astrologerankittyagiofficial’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి షేర్ చేసిన ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు.

  • “జోస్యం నిజమైంది” అని ఒక యూజర్ కామెంట్ చేయగా..
  • “అంటే చనిపోవడానికి 25 రోజుల ముందే తెలిసిపోయిందన్నమాట” అని మరొకరు రాశారు.
  • “జ్యోతిష్యులను తక్కువ అంచనా వేయకండి” అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.


Posted

in

by

Tags: