“వీపుపై 30 కిలోల బరువు మోస్తున్న తల్లి.” కేవలం ₹700 కూలీ కోసం ఏటవాలు కొండను ఎక్కుతూ.. పిల్లల చదువుల కోసం చేస్తున్న త్యాగం.. హృదయాన్ని కదిలించే ఉదంతం.!!

లడఖ్ మారథాన్ కోసం తీవ్రంగా సాధన చేస్తున్న అథ్లెట్ సార్థక్ మలానీ.. కొండపైకి ఎక్కే దారిలో చూసిన ఓ దృశ్యం ఆయన మనసును తీవ్రంగా కలచివేసింది.

దాదాపు 1.8 కిలోమీటర్ల నిటారైన, అత్యంత ప్రమాదకరమైన కొండ మార్గంలో.. వీపుపై 30 కిలోల బరువున్న భారీ ప్లైవుడ్ షీట్‌ను మోస్తూ కొండపైకి ఎక్కుతున్న ఓ వ్యక్తిని చూసి సార్థక్, అతనెవరో మగవ్యక్తి అనుకుని దగ్గరకు వెళ్లి మాట్లాడాడు. అయితే, ముఖానికి ఉన్న మాస్కు తీయగానే.. ఆ బరువు మోస్తోంది ‘సరిత’ అనే మహిళ అని తెలిసి ఆయన విస్తుపోయాడు.

ఆమెతో మాట్లాడినప్పుడు.. “నా పిల్లల చదువుల కోసం, కుటుంబ ఆకలిని తీర్చడం కోసం రోజుకు ₹700 కూలీ తీసుకుని రోజూ హిమాలయాల వంటి ఈ కఠినమైన పనిని చేస్తున్నాను” అని ఎలాంటి అలసట, అసంతృప్తి లేకుండా నవ్వుతూ చెప్పింది.

నగరాల్లో సుఖభోగాలకు అలవాటుపడి సోమరులుగా మారే మనుషుల మధ్య.. ఈ తల్లి అకుంఠిత దీక్ష, కష్టపడే తత్వం తనకు ఎంతో పెద్ద పాఠమని, జీవితంలో ఎప్పుడైనా నిరాశ కలిగితే సరిత అక్కనే గుర్తుచేసుకుంటానని చెబుతూ సార్థక్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. గుండెలను పిండేసే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతోంది.


Posted

in

by

Tags: