“వీళ్లు మనుషులేనా?.. 6 నెలల పసికందు ఏం తప్పు చేసింది!”.. ఆలయంలో చిన్నారిని దారుణంగా నేలకేసి కొట్టిన వ్యక్తి.. ఆరుపులతో వణికిపోయిన మహిళలు..!!

హర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌లోని ప్రముఖ సుఖానీ మాతా ఆలయ ప్రాంగణంలో జరిగిన ఓ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

మొన్న రాత్రి సుమారు పదిన్నర గంటల సమయంలో, గుర్తుతెలియని ఓ వ్యక్తి ఆరు నెలల పసికందును చేతిలో పట్టుకుని ఆలయ ప్రాంతానికి వచ్చాడు. అక్కడ ఎవరూ లేని సమయం చూసి, ఆ పసికందును అత్యంత క్రూరంగా నేలపైకి బలంగా విసిరేసి అక్కడి నుంచి పరారయ్యాడు.

చిన్నారి ఏడుపు విని కంగారుగా బయటకు వచ్చిన ఆలయంలోని మహిళలు, రక్తపు మడుగులో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పసికందును చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే ఆలయ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించడంతో పాటు, విషమ స్థితిలో ఉన్న చిన్నారిని రక్షించి సెక్టార్-10లోని సివిల్ ఆసుపత్రి అత్యవసర విభాగంలో చేర్పించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆ చిన్నారికి చికిత్స అందుతోంది.

ఈ అমানుష ఘటన ఆలయ ప్రధాన ద్వారం వద్ద అమర్చిన సీసీటీవీ (CCTV) కెమెరాలో స్పష్టంగా రికార్డయింది. ఆ ఫుటేజీని స్వాధీనం చేసుకున్న పోలీసులు, చిన్నారిని విసిరేసి వెళ్లిన ఆ వ్యక్తి ఎవరు? ఆ బిడ్డ అసలు తల్లిదండ్రులు ఎవరు? అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయగా, ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారి ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమవుతోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *