“వేడివేడి బిర్యానీ పాత్రలో కూర్చున్న వ్యక్తి”. సలసల కాగే బిర్యానీని అలాగే తీసి వడ్డిస్తున్న దృశ్యం.. ఆశ్చర్యపరుస్తూనే అసహ్యం పుట్టిస్తున్న వీడియో.!

బంగ్లాదేశ్‌లోని మీర్పూర్ ప్రాంతంలో ఉన్న ఒక బిర్యానీ దుకాణంలో బిర్యానీ వడ్డించే విధానంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది.

వేడివేడి బిర్యానీ ఓ పెద్ద పాత్ర (అండా)లో ఉండగా, ఓ వ్యక్తి ఆ వేడి పాత్రలోనే కూర్చుని బిర్యానీని వడ్డిస్తున్నాడు.

అయితే దీనిని కూడా జనం ఎంతో ఆసక్తిగా వచ్చి కొనుక్కెళ్లడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అతను వేడి బిర్యానీ పాత్రలో కూర్చోవడం ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ, పరిశుభ్రత (హైజీన్) పై ప్రస్తుతం పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను తీవ్ర విస్మయానికి, దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.


Posted

in

by

Tags: