వేరే దారి లేక.. అమెరికాకు తలవంచిన ఇరాన్..! యుద్ధాన్ని ఆపేందుకు భారీ నిబంధన..!

అమెరికా, ఇజ్రాయెల్‌ల మధ్య యుద్ధం తీవ్రతరమవుతున్న తరుణంలో ఇరాన్ ఒక కీలక ప్రకటన చేసింది. ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కతీబ్‌జాదే తన దేశ అణు కార్యక్రమాన్ని (Nuclear Program) ముగించడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. అమెరికా గనుక ఒక మంచి అవకాశాన్ని (డీల్‌ను) అందిస్తే, తమ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ తన అణు ప్రాజెక్టును పూర్తిగా ముగించడానికి అధికారికంగా మొగ్గు చూపడం ఇదే మొదటిసారి.

గతంలో కుదిరిన ఒప్పందాల ప్రకారం, ఇరాన్ కేవలం యురేనియం శుద్ధిని తగ్గించడం గురించి మాత్రమే మాట్లాడేది. కానీ ఇప్పుడు ఏకంగా అణు కార్యక్రమాన్నే వదులుకోవడానికి సిద్ధపడింది. ఇరాన్-అమెరికా మధ్య ఒక ఒప్పందాన్ని కుదర్చడానికి మధ్యప్రాచ్యంలోని 12 దేశాలు ప్రయత్నిస్తున్నాయి. టర్కీ విదేశాంగ మంత్రి హకన్ ఫిడాన్ నేతృత్వంలో ఒమన్, సౌదీ అరేబియా దేశాలు అమెరికాపై ఒత్తిడి పెంచుతున్నాయి.

డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాన్ వద్ద ప్రస్తుతం 460 కిలోల శుద్ధి చేసిన యురేనియం ఉంది. దీనిని ఉపయోగించి ఇరాన్ 11 అణు బాంబులను తయారు చేయగలదు. ప్రస్తుతం ఇరాన్ వద్ద ఉన్న యురేనియం 60 శాతం వరకు శుద్ధి చేయబడింది. అణు ఆయుధ తయారీకి దీనిని 90 శాతం వరకు శుద్ధి చేయాల్సి ఉంటుంది.

అమెరికా దాడులకు ముందు ఒమన్ మరియు జెనీవాలో జరిగిన రహస్య చర్చల్లో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరక్చీ, అమెరికా తరపున స్టీవ్ విట్కాఫ్ మరియు ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ పాల్గొన్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *