వైరల్ న్యూస్: ఇక్కడ ఆడవారి నీడ కూడా పడకూడదు! మహిళలే కాదు, ఆడ జంతువులకు కూడా నో ఎంట్రీ! కారణం ఇదే..

సాధారణంగా మనం మనుషులు వెళ్లలేని దీవుల గురించి వినే ఉంటాం. కానీ, మహిళలకు ప్రవేశం లేని చోటు గురించి ఎప్పుడైనా విన్నారా? ప్రపంచవ్యాప్తంగా సమాన హక్కుల గురించి చర్చ జరుగుతున్న ఈ కాలంలోనూ, కేవలం మహిళలే కాదు కనీసం ఆడ జంతువులకు కూడా ప్రవేశం లేని ఒక వింత ప్రదేశం ఉంది. అదే గ్రీస్ దేశంలోని ‘మౌంట్ అథోస్’ (Mount Athos).

వెయ్యి ఏళ్ల నాటి సంప్రదాయం ప్రకారం, ఈ పవిత్ర పర్వతంపై ఆడవారికి ప్రవేశం లేదు. దీని వెనుక ఉన్న కారణాలు ఇవే:

ఈ ప్రాంతం ఎక్కడ ఉంది? ఏజియన్ సముద్రం ఒడ్డున ఉన్న గ్రీస్ దేశంలోని మౌంట్ అథోస్ ఒక చిన్న ద్వీపం. ఇక్కడ సుమారు 2,000 మంది క్రైస్తవ సన్యాసులు నివసిస్తున్నారు. ఇది 20 చర్చిలకు నిలయం. దాదాపు 1,000 ఏళ్లుగా ఇక్కడ మహిళలపై నిషేధం కొనసాగుతోంది.

నిషేధం ఎప్పటి నుండి? మౌంట్ అథోస్‌లో మహిళల ప్రవేశాన్ని నిషేధించే నియమాన్ని ‘అవాటన్’ (Avaton) అని పిలుస్తారు. క్రీ.శ. 1046లో బైజాంటైన్ చక్రవర్తి కాన్స్టాంటైన్ IX ఈ నిబంధనను అధికారికంగా అమలులోకి తెచ్చారు.

నిషేధానికి కారణమేమిటి? సన్యాసుల బ్రహ్మచర్యాన్ని కాపాడటం ఈ నియమం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. సన్యాసుల దృష్టి మరలకుండా ఉండటానికి ఇక్కడ ఏ స్త్రీ జీవికీ ప్రవేశం ఉండకూడదని నిర్ణయించారు. ఆర్థోడాక్స్ సంప్రదాయం ప్రకారం, ఈ పర్వతాన్ని “దేవుని తల్లి తోట” (Garden of the Virgin Mary) అని పిలుస్తారు.

ఆడ జంతువులకు కూడా నో ఎంట్రీ! ఒక పురాణ గాథ ప్రకారం, వర్జిన్ మేరీ ఈ స్థలాన్ని సందర్శించినప్పుడు ఇక్కడి అందానికి ముగ్ధురాలైంది. అందుకే ఇక్కడ స్త్రీత్వానికి ప్రతినిధిగా వర్జిన్ మేరీ మాత్రమే ఉండాలని, వేరే ఏ స్త్రీకి ప్రవేశం ఉండకూడదని నమ్ముతారు. అందుకే ఆవు, గొర్రె, మేక, కోడి వంటి ఆడ పెంపుడు జంతువులను కూడా ఇక్కడ నిషేధించారు. అయితే, ఎలుకలను పట్టడానికి సహాయపడే ఆడ పిల్లులకు మాత్రం మినహాయింపు ఉంది. అలాగే అడవి జంతువులు, పక్షులపై నియంత్రణ ఉండదు.

మహిళలు ప్రవేశిస్తే శిక్ష ఏమిటి? పురుషులు కూడా ఈ దీవిలోకి వెళ్లాలంటే ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. మహిళలకు మాత్రం అస్సలు అనుమతి ఉండదు. గ్రీక్ చట్టం ప్రకారం, ఒకవేళ మహిళలు ఇక్కడ ప్రవేశిస్తే వారికి 12 నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. 1953లో ఒక మహిళ పురుషుడి వేషంలో ప్రవేశించడానికి ప్రయత్నించిన తర్వాత ఈ చట్టాన్ని మరింత కఠినతరం చేశారు.


Posted

in

by

Tags: