వైరల్ వీడియో కోసం ‘డెవిల్ క్రాబ్’ వండుకుని తిన్న మహిళ.. ఆపై 51 ఏళ్ల వయస్సులో దారుణ మరణం!

సోషల్ మీడియాలో వైరల్ కంటెంట్ సృష్టించాలనే తాపత్రయంతో, విషపూరితమైన సముద్రపు జీవిని తిన్న ఓ కంటెంట్ క్రియేటర్ మరణించింది.

ఫిలిప్పీన్స్‌లోని పలావాన్ ప్రావిన్స్‌కు చెందిన ఎమ్మ అమిత్ (51) అనే మహిళ, తన ఇంటి సమీపంలో ఒక వీడియో చిత్రీకరిస్తూ మనుషులకు అత్యంత హానికరమైన విషం కలిగిన సముద్రపు జీవిని తిని మరణించినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది.

వైరల్ వీడియో నేపథ్యం: ఫిబ్రవరి 4న, ఎమ్మ తన స్నేహితులతో కలిసి మడ అడవుల (Mangroves) వద్ద సముద్రపు జీవులను సేకరించి, వాటిని కొబ్బరి పాలు కలిపి వండుతున్నట్లు వీడియో తీశారు. ఆ వీడియోలో ఆమె ‘డెవిల్ క్రాబ్’ అని పిలవబడే పీతను లేదా ఒక రకమైన సముద్రపు నత్తను (Sea Snail) తిన్నట్లు కనిపిస్తుంది. ఆహారం తిన్న 24 గంటల లోపే ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. వెంటనే క్లినిక్‌కు తరలిస్తుండగా ఆమెకు హృదయ స్పందన ఆగిపోయింది (Heart Attack).

ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళినప్పుడు పెదవులు నీలం రంగులోకి మారిపోయాయని, ఆరోగ్య పరిస్థితి వేగంగా క్షీణించిందని సమాచారం. ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందించినప్పటికీ, ఆ జీవిని తిన్న రెండు రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 6న ఆమె మరణించింది. స్థానికంగా ‘డెవిల్ క్రాబ్’ అని పిలిచే ఈ విషపూరిత జీవులను తినవద్దని అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.

అధికారుల హెచ్చరిక: ఎమ్మ అమిత్ ఇంట్లో సోదాలు చేసిన అధికారులకు ‘డెవిల్ క్రాబ్’ యొక్క పైకప్పు (Shell) లభించింది. ఇవి సాధారణంగా ఇండో-పసిఫిక్ సముద్ర తీరాల్లో కనిపిస్తాయి. వీటిలో శాక్సిటాక్సిన్ (Saxitoxin) మరియు టెట్రోడోటాక్సిన్ (Tetrodotoxin) వంటి శక్తివంతమైన న్యూరోటాక్సిన్లు ఉంటాయి. ఇవి పఫర్ ఫిష్ (Pufferfish) లో ఉండే విషం లాంటివే. ఈ విషం శరీరంలోకి వెళ్ళిన కొద్ది గంటల్లోనే మనిషి నాడీ వ్యవస్థను దెబ్బతీసి ప్రాణాంతకంగా మారుతుంది.


Posted

in

by

Tags: