శిఖర్ ధావన్‌కు ఎక్స్-వైఫ్ 5.2 కోట్లు తిరిగి ఇవ్వాలి: రెండో పెళ్లయిన 3 రోజులకే ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు!

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ (గబ్బర్) ఇటీవల తన గర్ల్‌ఫ్రెండ్ సోఫీ షైన్‌ను ఘనంగా రెండో వివాహం చేసుకున్నారు. ఈ వేడుకలో రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, ఇర్ఫాన్ పఠాన్, సురేష్ రైనా వంటి దిగ్గజ క్రికెటర్లు సందడి చేశారు. పెళ్లయిన కొద్దిరోజులకే ధావన్‌కు మరో శుభవార్త అందింది. అతని మాజీ భార్య అయేషా ముఖర్జీ ధావన్‌కు సుమారు ₹5.72 కోట్లు తిరిగి చెల్లించాలని ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది.

అసలు వివాదం ఏంటి?

శిఖర్ ధావన్, అయేషా ముఖర్జీలకు 2023లో విడాకులు అయ్యాయి. అయేషా ఆస్ట్రేలియా పౌరురాలు కావడంతో, ఆ దేశ ఫ్యామిలీ కోర్టులో ఆస్తుల పంపకం (Property Settlement) కోసం పిటిషన్ వేశారు. ‘మ్యాట్రిమోనియల్ అసెట్స్’ పంపకంలో భాగంగా ధావన్ తన మాజీ భార్యకు ₹5.72 కోట్ల భారీ మొత్తాన్ని ఇవ్వాలని ఆస్ట్రేలియా కోర్టు అప్పట్లో ఆదేశించింది. దీనిని ధావన్ ఢిల్లీ కోర్టులో సవాలు చేశారు.

ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు తీర్పు:

ఆస్ట్రేలియా కోర్టు ఇచ్చిన ఆదేశాలు భారత భూభాగంపై చెల్లవని ఢిల్లీ కోర్టు స్పష్టం చేసింది.

  • భారత చట్టాలకు విరుద్ధం: ఆస్ట్రేలియాలో ఉన్న ‘ప్రాపర్టీ సెటిల్మెంట్’ అనే కాన్సెప్ట్ భారత చట్టాలకు, ముఖ్యంగా హిందూ వివాహ చట్టానికి పూర్తి భిన్నమైనదని జడ్జి అభిప్రాయపడ్డారు.
  • ఆదేశం: భారత చట్టాల ప్రకారం అటువంటి నిధుల బదిలీకి నేరుగా ఎటువంటి నిబంధన లేదని పేర్కొంటూ, ఆస్ట్రేలియా కోర్టు ఆదేశం చెల్లదని కొట్టివేసింది. దీనితో అయేషా ముఖర్జీ ఆ డబ్బును తిరిగి ధావన్‌కు ఇచ్చేయాలని కోర్టు తీర్పునిచ్చింది.

Posted

in

by

Tags: