భర్త నిద్రపోగానే ప్రియుడిని ఇంటికి రప్పించే ఒక మహిళ, తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది.
ఆ తర్వాత, ఈ ఘటనను సహజ మరణంగా చిత్రీకరించడానికి ప్లాన్ చేసిన ఆ మహిళ, మోతాదుకు మించి పవర్‌ఫుల్ టాబ్లెట్లు వేసుకోవడం వల్లే భర్త చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేసింది. ఇందుకోసం హత్యకు గురైన భర్త చొక్కా జేబులో ఖాళీ టాబ్లెట్ స్ట్రిప్పులను కూడా పెట్టి నాటకమాడింది.
అయితే, పోస్టుమార్టం నివేదికలో అతడు హత్యకు గురయ్యాడని నిర్ధారణ కావడంతో పోలీసులు తీవ్రంగా విచారణ జరిపారు. అనుమానంతో భార్య కాల్ డేటాను పరిశీలించగా, ప్రియుడితో ఆమె నిరంతరం మాట్లాడినట్లు తేలింది. దాని ఆధారంగా జరిపిన తీవ్ర విచారణలో, భార్య షబానా మరియు ఆమె ప్రియుడు రేహాన్ కలిసి ఈ హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు.

Leave a Reply