మహారాష్ట్రలోని ఉమాడి గ్రామంలోని ఒక బావిలో, నీటిపై పెట్రోల్ వంటి మండే స్వభావం గల ద్రవం తేలుతూ ఉండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఆ నీటిని పరీక్షించి చూడగా అది క్షణాల్లో భగ్గున మండిపోతుండటంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
బావి సమీపంలోనే ఒక పెట్రోల్ బంక్ ఉండటంతో, దాని భూగర్భ ట్యాంక్ నుంచి ఇంధనం ఏమైనా లీక్ అయి ఉంటుందా అని మొదట్లో అనుమానించారు. దీంతో హెచ్పీసీఎల్ (HPCL) అధికారులు వచ్చి తనిఖీలు చేపట్టారు; అయితే పెట్రోల్ బంక్ ట్యాంకుల నుంచి ఎలాంటి లీకేజీ లేదని వారు స్పష్టం చేశారు.
బావి యజమాని దుండప్ప మాలీ మాట్లాడుతూ.. ఆ నీటిని తాగడానికి గానీ, పశువులకు గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించవద్దని హెచ్చరించారు. అంతేకాకుండా, ఈ విషయం తెలిసి జనం గుమిగూడే అవకాశం ఉన్నందున, ఆసక్తితో ఎవరూ బావి దగ్గరకు వెళ్లి ప్రమాదాల బారిన పడకుండా సరైన రక్షణ చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను కోరారు.
బావి నీటిపై తేలుతున్న ఆ ద్రవం నిజంగా పెట్రోలా లేక మరేదైనా రసాయనమా? అసలు అది బావిలోకి ఎలా వచ్చింది? అనే కోణాల్లో జిల్లా యంత్రాంగం, సంబంధిత అధికారులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.

Leave a Reply