నదిలోని భారీ మొసలికి ఆహారం పెట్టడమే కాకుండా.. దాని కాళ్లకు నమస్కరించి, అదే నీటిని తాగిన ఓ వ్యక్తి చర్య ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.
శాస్త్రీయ అవగాహనను, భద్రతా నియమాలను పక్కనపెట్టి.. మూఢనమ్మకాల ఆధారంగా ఇలాంటి ప్రమాదకర పనులు చేయడం ప్రాణాలకే ముప్పు తెచ్చుకోవడమేనని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మొసళ్లు అత్యంత వేగంగా దాడి చేయగల ప్రమాదకరమైన వన్యప్రాణులు. వాటి దగ్గర ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని వన్యప్రాణి నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అంతేకాదు, జంతువులు నివసించే నీటి వనరుల్లో హానికరమైన బ్యాక్టీరియా, పరాన్నజీవులు ఉండే అవకాశం ఉంది. అలాంటి నీటిని శుద్ధి చేయకుండా నేరుగా తాగడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రాణాలకు ముప్పు తెచ్చే ఇలాంటి సాహసాలు ఎందుకు? ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Leave a Reply