సంచలనం: ‘పాప ఊపిరి ఆడట్లేదు’ అంటూ ఆసుపత్రికి తెచ్చిన తల్లి; పోలీసుల విచారణలో బయటపడ్డ నిజం, కన్నతల్లి అరెస్ట్

కర్ణాటక: బెళగావి జిల్లా, రామదుర్గ తాలూకాలోని హిరేమూలంగి గ్రామంలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కన్నతల్లే తన పసికందును గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

మగబిడ్డ కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఆ తల్లికి, నాలుగోసారి కూడా ఆడబిడ్డ జన్మించడంతో ఆగ్రహంతో ఈ ఘాతుకానికి పాల్పడింది.

ఈ హత్యాకాండకు పాల్పడిన తల్లి పేరు అశ్వినీ హళకట్టి.

ఆమెకు ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. నవంబర్ 23న ముదకవి ఆరోగ్య కేంద్రంలో నాలుగోసారి కూడా ఆడబిడ్డ జన్మించింది. దీంతో తీవ్ర నిరాశకు గురైన ఆమె, ఆ పసికందును గొంతు నులిమి చంపేసింది. ఆ తర్వాత, “పాప ఊపిరి తీసుకోవడం లేదు” అని నాటకమాడుతూ ఆ శిశువును తాలూకా ఆసుపత్రికి తీసుకువచ్చింది.

శిశువును పరీక్షించిన వైద్యాధికారులకు ఊపిరాడక మృతి చెందినట్లు అనుమానం రావడంతో, వెంటనే రామదుర్గ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. డివైఎస్పీ చిదంబర మడివాళర, సురేబాన్ పీఎస్‌ఐ శివాజీ పవార్ దర్యాప్తు చేపట్టగా, తల్లే తన బిడ్డను హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.


Posted

in

by

Tags: