సముద్రపు అలల మధ్య శాశ్వతంగా జీవించాలనుకునే వారి కోసం నిర్మించిన అమెరికాకు చెందిన ప్రసిద్ధ లగ్జరీ క్రూయిజ్ ‘ఒడిస్సీ’ (Odyssey) ప్రయాణం ప్రస్తుతం తీవ్ర ఆటంకంలో పడింది. ప్రపంచాన్ని చుట్టివచ్చే లక్ష్యంతో సుమారు 3 ఏళ్లుగా విజయవంతంగా ప్రయాణిస్తున్న ఈ తేలియాడే విలాసవంతమైన భవనం.. ఇంధనం (Fuel) కొరత కారణంగా కంబోడియా దేశంలోని ఓ ఓడరేవులో అర్ధంతరంగా నిలిచిపోయింది.
ఈ లగ్జరీ నౌకలో ప్రపంచ పర్యటనకు బయలుదేరిన 203 మంది పర్యాటకులు, వారికి సేవలందించేందుకు ఉన్న 156 మంది సిబ్బంది ప్రస్తుతం మధ్యలోనే చిక్కుకుపోయే పరిస్థితి ఏర్పడింది. సముద్రంలోనే విలాసవంతమైన జీవితాన్ని గడపొచ్చని ఆశించి వచ్చిన పర్యాటకులకు, నౌక ప్రయాణం ఇలా మధ్యలోనే నిలిచిపోవడం తీవ్ర దిగ్భ్రాంతిని, ఆందోళనను మిగిల్చింది.
ఇంధన కొరత కారణంగా కంబోడియా పోర్టులో నిలిచిపోయిన ఈ అమెరికన్ నౌకను తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారనే దానిపై, అలాగే పర్యాటకుల తదుపరి భద్రతా చర్యలపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన సమాచారం బయటకు రాలేదు. ఈ ఘటనకు సంబంధించిన వార్తలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
