అదృష్టం అనేది ఎప్పుడు, ఎవరిని, ఎలా వరిస్తుందో ఎవరూ ఊహించలేరు. అది గనుక తలుపు తడితే ఒక సామాన్యుడు కూడా రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోవచ్చు. ఇప్పుడు థాయ్‌లాండ్‌లో జరిగిన ఈ వింత ఘటనే అందుకు నిదర్శనం. ఇక్కడ నాఖోన్ సీ థమ్మారత్ (Nakhon Si Thammarat) తీరంలో నడుస్తున్న ఒక మహిళకు ఇసుకలో ఒక వింత వస్తువు దొరికింది, అది ఆమె జీవితాన్నే మార్చేసింది.
చేపల వాసన తెచ్చిన అదృష్టం
వివరాల్లోకి వెళితే.. 49 ఏళ్ల సిరిపోర్న్ న్యూమరిన్ అనే మహిళ సముద్ర తీరంలో సరదాగా నడుస్తుండగా, ఆమెకు ఇసుకలో ఒక వింత ముద్ద (గాంఠు) కనిపించింది. దాని నుండి ఒక రకమైన వింతైన చేపల వాసన వస్తుండటంతో, అది ఏదైనా ఉపయోగపడే వస్తువు కావచ్చు అని భావించి ఆమె దానిని తన ఇంటికి తీసుకెళ్లింది.
ఆ తర్వాత తన పొరుగువారిని పిలిచి ఆ వింత వస్తువు ఏంటో గుర్తించమని కోరింది. ఆ వస్తువును పరిశీలించిన ఒక స్థానికుడు అది మరేదో కాదు, తిమింగలం (Whale) వాంతి అని చెప్పాడు. దీనినే అంతర్జాతీయ మార్కెట్లో ‘అంబర్గ్రిస్’ (Ambergris) అని పిలుస్తారు.
ఇది విన్న న్యూమరిన్ ఆశ్చర్యపోయింది. తిమింగలం వాంతులకు అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన ధర పలుకుతుందని ఆమెకు తర్వాత తెలిసింది. ఆమెకు దొరికిన అంబర్గ్రిస్ ముద్ద 12 ఇంచుల వెడల్పు, 24 ఇంచుల పొడవు ఉంది. దీని బరువు ఆధారంగా అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ దాదాపు 1.86 lakhs పౌండ్లు.. అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు రూ. 1.8 కోట్లు ఉంటుంది!
పర్ఫ్యూమ్ తయారీలో దీని ప్రాధాన్యత ఏంటి?
మీ సమాచారం కోసం.. ఈ అంబర్గ్రిస్ లేదా తిమింగలం వాంతి అనేది ‘స్పెర్మ్ తిమింగలాల’ (Sperm Whales) జీర్ణవ్యవస్థలో తయారవుతుంది.
దీనిని ప్రపంచ ప్రసిద్ధ లగ్జరీ పర్ఫ్యూమ్ల (సుగంధ ద్రవ్యాల) తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
పర్ఫ్యూమ్ సువాసన గాల్లో కలిసిపోకుండా, ఎక్కువ కాలం (Long-lasting) నిలిచి ఉండేలా చేయడంలో ఇది ఒక అద్భుతమైన స్థిరకారిణిగా (Fixative) పనిచేస్తుంది. అందుకే దీనికి అంత డిమాండ్.
అసలైన అంబర్‌గ్రిస్‌ను గుర్తించడం ఎలా?
ఒకవేళ మీకు కూడా ఎప్పుడైనా సముద్ర తీరాల్లో ఇలాంటి వింత వస్తువు దొరికితే, అది నిజమైన అంబర్గ్రిస్ అవునో కాదో ఒక చిన్న హోమ్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆ ముద్దలో నుండి ఒక చిన్న ముక్కను కట్ చేసి మంటపై ఉంచాలి. అది వెంటనే కొవ్వొత్తిలా కరిగిపోయి, మంట నుండి తీసేసాక మళ్లీ గట్టిగా మారితే అది ఖచ్చితంగా అసలైన అంబర్గ్రిస్ అని అర్థం. న్యూమరిన్ కూడా సరిగ్గా ఇదే పరీక్ష చేసి, అది అసలైనదేనని ప్రాథమికంగా నిర్ధారించుకుంది.
నిపుణుల కోసం నిరీక్షణ
ప్రస్తుతం ఆమె ఈ అంబర్గ్రిస్ యొక్క నాణ్యతను, ప్రామాణికతను అధికారికంగా పరీక్షించడానికి ప్రభుత్వ నిపుణుల కోసం ఎదురుచూస్తోంది. ఈ సందర్భంగా న్యూమరిన్ మాట్లాడుతూ.. “నాకు ఇంత పెద్ద అంబర్గ్రిస్ ముక్క దొరకడం నా అదృష్టం. దీని ద్వారా నాకు మంచి డబ్బు వస్తుందని ఆశిస్తున్నాను” అని ఆనందం వ్యక్తం చేసింది.
ప్రస్తుతం ఆమె దానిని తన ఇంట్లో భద్రపరిచింది. స్థానిక కౌన్సిల్ అధికారులు త్వరలోనే దీనిని లాబొరేటరీ పరీక్షల నిమిత్తం తీసుకెళ్లనున్నారు.

Leave a Reply