కరూర్ జిల్లాకు చెందిన కుమరేశన్ (33) కోయంబత్తూరులోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు.
అదే కళాశాలలో పనిచేస్తున్న 30 ఏళ్ల మహిళా ప్రొఫెసర్, ఇతను ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో, ఆ ప్రొఫెసర్‌ను ఊటీకి విహారయాత్రకు తీసుకెళ్లిన కుమరేశన్, అక్కడ ఉన్న లాడ్జిలో ఆమెను మోసం చేసి లైంగిక దాడికి పాల్పడినట్లు చెప్పబడుతోంది. వీరి ప్రేమ వ్యవహారం కొనసాగుతుండగా, కుమరేశన్‌కు వేరే ఒక యువతితో పెళ్లి చేయడానికి అతని కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారని ప్రొఫెసర్‌కు తెలిసింది.
దీని గురించి కుమరేశన్‌ను ప్రొఫెసర్ ప్రశ్నించగా, తమ ఇద్దరి కులాలు వేర్వేరు కాబట్టి పెళ్లి చేసుకోవడం కుదరదని అతడు నిరాకరించాడు. ప్రేమిస్తున్నానని నమ్మించి, పెళ్లి విషయానికి వచ్చేసరికి కులాన్ని కారణం చూపి చేయి దులపేసుకున్న ప్రియుడి చర్యతో తీవ్ర దిగ్భ్రాంతికి, మనస్తాపానికి గురైన ప్రొఫెసర్, వెంటనే కోయంబత్తూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటన జరిగిన ప్రదేశం ఊటీ కావడంతో, ఈ కేసు విచారణను ఊటీ మహిళా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.
దీనిని నమోదు చేసుకుని ఫిర్యాదు తీవ్రతను గుర్తించిన పోలీసులు, ఫిజికల్ డైరెక్టర్ కుమరేశన్‌పై కేసు నమోదు చేశారు. తీవ్ర విచారణ అనంతరం పరారీలో ఉన్న ఫిజికల్ డైరెక్టర్ కుమరేశన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, అతడిని కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపారు. ప్రేమిస్తున్నానని నమ్మించి ప్రొఫెసర్‌ను మోసం చేసిన ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలాన్ని, దిగ్భ్రాంతిని కలిగించింది.

Leave a Reply