సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఒక వీడియో నెటిజన్లను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
కారులో హాయిగా కూర్చుని చేతిలో ఉన్న గ్రెనేడ్‌తో ఆడుకున్న కొందరు యువకులు తమ ప్రాణాలనే పణంగా పెట్టిన ఈ షాకింగ్ ఘటన చూసేవారి రక్తాన్ని గడ్డకట్టించేలా ఉంది.
యెమెన్ దేశంలోని తీర ప్రాంత నగరమైన ఎడెన్‌లో ఈ ఘటన జరిగినట్లు చెబుతున్న వీడియో వైరల్ అవుతోంది. కారులో సుమారు ఐదుగురు యువకులు కూర్చుని, అక్కడ సాధారణంగా నమిలే ‘ఖాట్’ (Khat) ఆకులను నములుతూ సరదాగా మాట్లాడుకుంటున్నారు.
ఆ సమయంలో వారిలో ఒకడు తన చేతిలో ఉన్న గ్రెనేడ్‌తో తుంటరి పని చేశాడు. ఎవరూ ఊహించని సమయంలో ఆ బాంబు రక్షణ పిన్ (Safety Pin) ను అతడు పీకేసినట్లు తెలుస్తోంది. పిన్ ఊడిపోయిన కొన్ని క్షణాల్లోనే కారులో దారుణమైన పేలుడు సంభవించింది.
పిన్ తీసిన మరుక్షణమే తీవ్ర శబ్దంతో బాంబు పేలిపోయింది. ఈ పేలుడు తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే, మొత్తం కారు నుజ్జునుజ్జయి తీవ్రంగా ధ్వంసమైంది. కారులో ఉన్న యువకులందరూ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
ముఖ్యంగా బాంబును చేతిలో పట్టుకున్న యువకుడి చెయ్యి ఛిద్రమైపోయిందని, గాయపడిన వారిలో ఒక సెక్యూరిటీ ఆఫీసర్ తమ్ముడు కూడా ఉన్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయినప్పటికీ, ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగింది అనే దానిపై అధికారిక సమాచారం ఇంకా ధృవీకరించబడలేదు. ప్రమాదకరమైన ఆయుధాలతో ఆడుకుంటే ఎలాంటి మూల్యం చెల్లించాల్సి వస్తుందో చెప్పడానికి ఈ ఘటన ఒక హెచ్చరికగా నిలిచింది.

Leave a Reply