‘సెక్స్ చేస్తావా..?’: రైడ్ కన్ఫర్మ్ అవ్వగానే క్యాబ్ డ్రైవర్‌కు కస్టమర్ అసభ్యకర సందేశాలు

గురుగ్రామ్: సోషల్ మీడియాలో నిత్యం రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కానీ, హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన విశాల్ అనే క్యాబ్ డ్రైవర్ షేర్ చేసిన వీడియో చూసి నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు.

ఏం జరిగింది?: విశాల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక లైవ్ వీడియోను షేర్ చేశారు. ఒక కస్టమర్ ఆలయానికి వెళ్లడానికి రైడ్ బుక్ చేశారు. రైడ్ కన్ఫర్మ్ అవ్వగానే ఆ కస్టమర్ డ్రైవర్‌కు మెసేజ్ చేస్తూ.. “హలో బ్రో, సెక్స్ చేస్తావా? ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ నంబర్ షేర్ చెయ్” అంటూ అసభ్యకరంగా అడిగారు. డ్రైవర్ ‘నో’ అని సమాధానం ఇవ్వగానే కస్టమర్ వెంటనే రైడ్ క్యాన్సిల్ చేశారు.

డ్రైవర్ ఆవేదన: ఇంతకుముందు ఇలాంటివి కేవలం రాపిడో (బైక్ టాక్సీ) డ్రైవర్లకే ఎదురయ్యేవని, ఇప్పుడు క్యాబ్ డ్రైవర్లకు కూడా తప్పడం లేదని విశాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ డ్రైవర్ ఇలాంటి మెసేజ్ ప్యాసింజర్‌కు పంపి ఉంటే కంపెనీ వెంటనే చర్యలు తీసుకునేదని, కానీ డ్రైవర్లకు ఇలాంటివి ఎదురైతే కంపెనీలు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.


Posted

in

by

Tags: