ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రా జిల్లాలోని ‘న్యూ ఆగ్రా’ ప్రాంతంలో స్పా సెంటర్ పేరుతో సాగుతున్న వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. పక్కా సమాచారంతో పోలీసులు జరిపిన ఈ దాడిలో ఒక మహిళ సహా ముగ్గురు పురుషులను అరెస్ట్ చేశారు.
కుమార్తెనే బలిపశువును చేసిన తల్లి: ఈ దాడిలో పోలీసులు నలుగురు యువతులతో పాటు ఒక మైనర్ బాలికను రక్షించారు. విచారణలో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. పట్టుబడిన మహిళ తన భర్తకు దూరంగా ఉంటూ, తన ప్రియుడితో కలిసి విటులను వెతికేది. కేవలం రూ. 4 వేల కోసం తన సొంత మైనర్ కుమార్తెను కూడా విటుల వద్దకు పంపిస్తున్నట్లు తేలింది. ఇతర మహిళలకు పని ఇప్పిస్తామని ఆశ చూపి ఈ రొంపిలోకి దించేవారని పోలీసులు తెలిపారు.
స్పా సెంటర్ ముసుగులో.. ‘సిటీ బాడీ స్పా’ పేరుతో ఈ కేంద్రం నడుస్తోంది. దీనికి మాస్టర్ మైండ్ అయిన లవ్కుష్ అనే వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇక్కడకు వచ్చే విటుల నుంచి ఎటువంటి ఐడి కార్డులు తీసుకోకుండా, రిజిస్టర్లో ఎంట్రీలు లేకుండా గుట్టుగా ఈ వ్యభిచారం సాగిస్తున్నారు. పోలీసులు దాడి చేసిన సమయంలో పలువురు అభ్యంతరకర స్థితిలో పట్టుబడ్డారు. అక్కడ లభించిన ఆధారాలను బట్టి ఇది చాలా పెద్ద నెట్వర్క్ అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
