సొంత ఖర్చుతో శూన్యం.. 2022 తర్వాత అమెరికాలో ఘోర కలికాలం! ట్రంప్‌కు వ్యతిరేకంగా రోడ్లపైకి ప్రజలు

ప్రశాంతంగా ఉన్న ఇరాన్‌పై దాడి చేసి, గల్ఫ్ యుద్ధాన్ని అమెరికా స్వయంగా కొనితెచ్చుకుంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా, 2022 తర్వాత అమెరికాలో ఇంధన ధరలు మరోసారి భారీగా పెరిగాయి. ఇది ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. ఈ యుద్ధానికి, ప్రస్తుత ధరల పెరుగుదలకు ట్రంప్ నిర్ణయాలే కారణమని ప్రజలు మండిపడుతున్నారు.

అమెరికాలో పెట్రోల్ ధర ఎంత? నేటి గణాంకాల ప్రకారం, ఒక గ్యాలన్ (3.8 లీటర్లు) పెట్రోల్ సగటు ధర 4 డాలర్లు దాటింది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ. 334. గత 2022 సంవత్సరం తర్వాత ఇంధన ధరలు ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి. ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరగడమే ఈ ఆకస్మిక పెరుగుదలకు కారణమని భావిస్తున్నారు.

ధరల పెరుగుదల: ఏఏఏ (AAA) వాహన సంఘం వెల్లడించిన సమాచారం ప్రకారం, ఒక గ్యాలన్ సాధారణ పెట్రోల్ జాతీయ సగటు ధర ప్రస్తుతం 4.02 డాలర్లుగా ఉంది. యుద్ధం ప్రారంభం కావడానికి ముందున్న ధర కంటే ఇది ఒక డాలర్ కంటే ఎక్కువే కావడం గమనార్హం. గతంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమయంలో మాత్రమే అమెరికన్లు ఇటువంటి గరిష్ట ధరలను ఎదుర్కొన్నారు.

రాష్ట్రాల వారీగా వ్యత్యాసం: ఇది జాతీయ సగటు మాత్రమే. కొన్ని రాష్ట్రాల్లో ఒక గ్యాలన్ ధర 4 డాలర్ల కంటే ఎక్కువే ఉంది. పన్నులు, రవాణా సౌకర్యాల బట్టి ధరల్లో మార్పులు ఉంటాయి. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై యుద్ధం ప్రకటించినప్పటి నుండి ముడి చమురు ధరలు వేగంగా పెరుగుతూ వస్తున్నాయి.

ప్రజల నిరసన: మధ్యప్రాచ్యంలోని ప్రధాన చమురు ఉత్పత్తి దేశాల్లో సరఫరా వ్యవస్థ దెబ్బతినడం, ఉత్పత్తి తగ్గడం వల్ల ధరలు పెరిగాయి. ఇది సామాన్య వినియోగదారులపై మరియు వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న కుటుంబాలకు ఈ ధరల పెరుగుదల గుదిబండగా మారింది. ఈ ఆగ్రహం ఇప్పుడు ట్రంప్‌కు వ్యతిరేకంగా మారి, అమెరికా అంతటా ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు.


Posted

in

by

Tags: