సొంత ‘సవతి తల్లి’ ప్రేమలో పడ్డ కొడుకు.. ఇద్దరూ కలిసి పారిపోవడానికి సిద్ధం; రాత్రి చీకట్లో ఏం జరిగిందంటే!

నూహ్: ‘ప్రేమించినప్పుడు భయమెందుకు?’ అనే పాట మీరు వినే ఉంటారు. వినడానికి ఇది బాగానే ఉన్నా.. మరీ అంత ధైర్యం తెచ్చుకుని, కన్న తండ్రి భార్యను (సవతి తల్లిని) తీసుకుని పారిపోయేంత నిస్సిగ్గుగా మారడం కరెక్ట్ కాదు కదా! అవును, మీరు చదివింది నిజమే. హర్యానాలో ఒక కొడుకు ప్రేమలో పడి తన సవతి తల్లినే తీసుకుని పారిపోయాడు. దీంతో ఆ అమాయకపు తండ్రి ఆశలన్నీ అడియాసలయ్యాయి.

అసలు ఏమిటీ విచిత్రమైన కథనమో ఇప్పుడు చూద్దాం.
ఈ ఘటన హర్యానాలోని ‘నూహ్’ (Nuh) జిల్లాలో వెలుగుచూసింది. ఇక్కడి బాస్‌దల్లా గ్రామానికి చెందిన రామ్‌కిషన్ (కన్హయ్య కుమారుడు) కి దాదాపు 18 ఏళ్ల క్రితం ఫిరోజాబాద్‌కు చెందిన మహిళతో వివాహం జరిగింది. మొదటి భార్యకు ఒక కుమారుడు జన్మించాడు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఆమె మరణించింది. భార్య మరణించిన మూడు సంవత్సరాల తర్వాత రామ్‌కిషన్ ‘సోహ్నా’కు చెందిన మరో మహిళతో రెండవ వివాహం చేసుకున్నాడు. రామ్‌కిషన్, అతని రెండవ భార్యల వివాహ బంధానికి దాదాపు 15 ఏళ్లు పూర్తి కాగా, వారికి ఒక కుమార్తె కూడా జన్మించింది.

ఆ తర్వాత కొడుకు ఎంట్రీ ఇచ్చాడు…
రామ్‌కిషన్ మొదటి భార్య కొడుకు (మైనర్) పెద్దయ్యాక ఎట్టకేలకు తన తండ్రి అడ్రస్ కనుక్కుని పున్హానా ప్రాంతానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో అతను దాదాపు మూడు నెలల పాటు తన తండ్రి మరియు సవతి తల్లితో కలిసే ఉన్నాడు. అయితే ఈ మూడు నెలల కాలంలోనే ఆ మైనర్ కొడుకుకు, సవతి తల్లికి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. వారు ఎంతగా దగ్గరయ్యారంటే.. ఇద్దరూ ఇల్లు వదిలి పారిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒకరోజు రాత్రి ఎవరికీ తెలియకుండా ఇద్దరూ ఇల్లు వదిలి పారిపోయారు. ఈ విషయం రామ్‌కిషన్‌కు అస్సలు తెలియలేదు. ప్రేమికులుగా మారిన వీరిద్దరూ ఇళ్లలోని నగలు, విలువైన వస్తువులతో పరారై కోర్టులో పెళ్లి చేసుకున్నారు. ఆమె వెళ్తూ వెళ్తూ ₹30 వేల నగదు, వెండి పట్టీలు, బంగారు కమ్మలు, చేతి ఆభరణాలు (హాత్ ఫూల్), వెండి మొలతాడును కూడా ఊడ్చుకుపోయింది.

ఏడుస్తూ పోలీసుల వద్దకు చేరిన తండ్రి
భార్య, కొడుకు ఆచూకీ కోసం ఆ తండ్రి గత 3 నెలలుగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో బాధితుడు ‘సీఎం విండో’ (CM Window) ద్వారా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తూ వారిద్దరిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. “మొదట్లో నా కొడుకు తన తల్లి కాళ్లకు నమస్కరించేవాడు, కానీ వారి మధ్య ప్రేమ ఎప్పుడు చిగురించిందో తెలియదు.. చూస్తూ చూస్తూనే ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టారు” అని బాధితుడు కన్నీరుమున్నీరయ్యాడు.


Posted

in

by

Tags: