సోషల్ మీడియాలో వేరే మహిళ ఫోటోకు ‘లైక్’.. విడాకుల కేసు వేయవచ్చు; కోర్టు కీలక తీర్పు!

నమ్మకద్రోహం అంటే కేవలం శారీరక సంబంధం మాత్రమే కాదు. ప్రస్తుతం ‘మైక్రో-చీటింగ్’ (Micro-cheating) అనే కొత్త పదం పుట్టుకొచ్చింది. అంటే, తీవ్రమైన తప్పు చేయకపోయినా.. బంధంలో అపనమ్మకాన్ని కలిగించేలా ప్రవర్తించడం. ఈ క్రమంలోనే, భర్త సోషల్ మీడియాలో వేరే మహిళల పోస్టులకు నిరంతరం లైక్ చేయడాన్ని విడాకులకు ప్రాతిపదికగా స్వీకరించవచ్చని కోర్టు పేర్కొంది.

ఏమిటీ ఘటన? తుర్కియే (Turkey) దేశంలోని సుప్రీం కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఈ తీర్పునిచ్చింది. ఒక మహిళ తన భర్త తనను అవమానిస్తున్నాడని, నిరంతరం సోషల్ మీడియాలోనే గడుపుతూ పరాయి మహిళల ఫోటోలను లైక్ చేస్తూ, వాటి కింద అసభ్యకరమైన కామెంట్లు పెడుతున్నాడని కోర్టును ఆశ్రయించింది. ఇది వివాహ బంధం పట్ల ఉండాల్సిన నిబద్ధతను ఉల్లంఘించడమేనని ఆమె తరపు న్యాయవాదులు వాదించారు.

కోర్టు తీర్పు: రెండు పక్షాల వాదనలు విన్న కోర్టు భర్తదే తప్పు అని తేల్చింది. ఇది ఏదో పొరపాటున జరిగిన విషయం కాదని, ఆయన నిరంతరం బహిరంగంగా ఇలాంటి పనులకు పాల్పడుతున్నాడని పేర్కొంది. దీనివల్ల భార్యకు పరిహారంతో పాటు, భరణం (Alimony) కూడా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఆన్‌లైన్ ప్రవర్తన అనేది చిన్న విషయం కాదని కోర్టు స్పష్టం చేసింది.


Posted

in

by

Tags: