“స్కూల్ టీసీ కావాలంటే హోటల్‌కు రా” – విద్యార్థి తల్లి పట్ల ప్రిన్సిపాల్ అసభ్య ప్రవర్తన.. బుద్ధి చెప్పిన బజరంగ్ దళ్..!!

గుజరాత్ రాష్ట్రం నదియాడ్‌లోని ఒక పాఠశాల ప్రిన్సిపాల్ తన పదవిని అడ్డుపెట్టుకుని ఒక తల్లి పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.

తన బిడ్డ యొక్క ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (TC) తీసుకోవడానికి వచ్చిన ఒక హిందూ తల్లిని, టీసీ కావాలంటే తనను ఒంటరిగా ఒక హోటల్‌లో కలవాలని ఆ ప్రిన్సిపాల్ వేధించాడు. అంతేకాకుండా, వాట్సాప్‌లో అత్యంత అసభ్యకరమైన సందేశాలు పంపిస్తూ ఆ మహిళను మానసిక వేదనకు గురిచేశాడు.

బజరంగ్ దళ్ రంగ ప్రవేశం: ఆ ధైర్యవంతురాలైన మహిళ ఈ విషయాన్ని బజరంగ్ దళ్ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. వారి సలహా మేరకు, ఆమె ఆ ప్రిన్సిపాల్ చెప్పిన హోటల్‌కు వెళ్లగా.. అప్పటికే అక్కడ మాటు వేసిన బజరంగ్ దళ్ సభ్యులు మెరుపు వేగంతో లోపలికి ప్రవేశించి ఆ కామాంధుడైన ప్రిన్సిపాల్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. హోటల్ గదిలోనే అతనికి “సరైన రీతిలో బుద్ధి చెప్పి”, ఆపై ఈడ్చుకుంటూ వెళ్లి పోలీసులకు అప్పగించారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన వ్యక్తి ఇలాంటి నీచమైన పనికి ఒడిగట్టడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. తమకు రక్షణగా నిలిచిన బజరంగ్ దళ్ సభ్యులకు ఆ మహిళ కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపారు.


Posted

in

by

Tags: