స్టేజీపై అసభ్యంగా తాకడంతో ఆగ్రహం! మహిళా కళాకారిణిని కోపంతో విసిరికొట్టిన ప్రముఖ గాయకుడు.. తప్పు ఎవరిది? వైరల్ వీడియోలు!!

భోజ్‌పురి సంగీత ప్రపంచంలో ప్రముఖ గాయకుడైన ధనంజయ్ శర్మ, ఇటీవల ఒక లైవ్ కాన్సర్ట్‌లో మహిళా డ్యాన్సర్‌ను స్టేజీపై నుండి తోసేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ తీవ్ర దుమారం రేపుతోంది.

అసలేం జరిగింది? స్టేజీపై పాట పాడుతున్న ధనంజయ్ శర్మ, అకస్మాత్తుగా అక్కడ డాన్స్ చేస్తున్న మహిళా కళాకారిణిని ఆవేశంతో పట్టుకుని నెట్టేశాడు. కింద పడిపోయిన ఆమె అక్కడి నుండి తప్పించుకోవాలని చూస్తుండగా, ఆమెను బలవంతంగా ఎత్తి ప్రేక్షకుల మధ్యలోకి విసిరికొట్టాడు. ఈ షాకింగ్ దృశ్యాన్ని చూసిన అక్కడి ప్రేక్షకులు మరియు యాంకర్ తీవ్రంగా ఖండించారు. “మీరు చేస్తోంది తప్పు, ఆమె ఒక మహిళ.. తనతో ఇలా ప్రవర్తించడం పద్ధతి కాదు” అని యాంకర్ స్టేజీపైనే అతడిని నిలదీశారు.

ధనంజయ్ శర్మ వివరణ: ఈ వీడియో వైరల్ కావడంతో తనను అరెస్టు చేయాలని డిమాండ్లు పెరిగాయి. దీనిపై ధనంజయ్ స్పందిస్తూ.. “కేవలం వీడియో చూసి నన్ను తప్పు పట్టకండి. పాటలో భాగంగా మేమిద్దరం ఒకరినొకరు ఢీకొంటున్నట్లు నటించాల్సి ఉంది. కానీ ఆ మహిళ నన్ను స్టేజీపై నుండి కిందకు తోసేయడానికి ప్రయత్నించింది. అంతేకాకుండా ఆమె నా ప్రైవేట్ భాగాలను (ఛాతీని) తాకడంతో ఆగ్రహం వచ్చి నేను ఆమెను నెట్టేశాను. నేను ఆమెను కేవలం స్టేజీ నుండి పక్కకు నెట్టాలని చూశాను కానీ, ఆమె పొరపాటున ప్రేక్షకులపై పడిపోయింది” అని చెప్పుకొచ్చాడు.

ఈ ఘటనపై ముజఫర్‌పూర్ పోలీసులు తీవ్ర విచారణ చేపట్టారు. ప్రోగ్రామ్‌కు సంబంధించిన పూర్తి వీడియోను పరిశీలించి, నిజానిజాలను తేల్చాలని ఆదేశించారు.


Posted

in

by

Tags: