స్పెషల్ మ్యారేజ్: మనవరాలి వయసున్న అమ్మాయితో 66 ఏళ్ల వృద్ధుడి ఏడడుగులు! వారన్న కారణం ఏంటంటే..

ప్రేమకు వయస్సుతో సంబంధం లేదని, కులమతాల భేదం ఉండదని అంటుంటారు. అయితే పెళ్లి విషయానికి వస్తే మాత్రం ఒక సరైన వయస్సు (Perfect Age) ఉండాలని సమాజం భావిస్తుంది. కానీ కొందరు ఆ వయస్సు అంతరాన్ని కూడా లెక్కచేయకుండా కొత్త జీవితంలోకి అడుగుపెడుతుంటారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లా, బంజార్ తాలూకాకు చెందిన తరింబల అనే చిన్న గ్రామంలో జరిగిన ఒక వింత వివాహం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ 66 ఏళ్ల సోమ్ దేవ్ అనే వ్యక్తి 35 ఏళ్ల యువతిని వివాహం చేసుకున్నారు. పెళ్లయి నెల రోజులు గడుస్తున్నా, ఇప్పుడు వీరి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.

66 ఏళ్ల వృద్ధుడు – 35 ఏళ్ల యువతి వివాహం సోమ్ దేవ్ మరియు ఆ యువతి వివాహం సాధారణ పెళ్లిళ్లలా జరగలేదు. వీరిద్దరి మధ్య 31 ఏళ్ల వయస్సు వ్యత్యాసం ఉంది. పరస్పర అంగీకారంతోనే తాము పెళ్లి చేసుకున్నట్లు వారు చెబుతున్నారు. వైరల్ అవుతున్న ఒక వీడియోలో, సోమ్ దేవ్ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఒక మహిళ వారిని చూసి కుతూహలంతో ‘మీరిద్దరూ ఏమవుతారు?’ అని ప్రశ్నించగా.. సోమ్ దేవ్ ప్రశాంతంగా ‘మేము భార్యాభర్తలం’ అని సమాధానమిచ్చారు.

ఆ మహిళ ఆశ్చర్యంతో వయస్సు గురించి అడగగా.. సోమ్ దేవ్ తన వయస్సు 66 అని, భార్య వయస్సు 35 అని చెప్పారు. ఆ యువతి కూడా ‘నేను ఆయన్ని బాగా చూసుకుంటాను, మా మధ్య మంచి అనుబంధం ఉంది’ అని నవ్వుతూ బదులిచ్చింది. ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు వీరి పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ, పాడుతున్న వీడియోలు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. వారి ముఖాల్లో కనిపిస్తున్న సంతోషం చూసి కొందరు ‘వీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అని కామెంట్ చేస్తుండగా.. మరికొందరు ‘ఇంకా పెళ్లి కాని వారికి ఇది గుండె కోత మిగిల్చే వార్త’ అని సరదాగా పోస్టులు పెడుతున్నారు.

అయితే మరికొందరు సీరియస్‌గా స్పందిస్తూ.. వయస్సు అనేది కేవలం ఒక అంకె మాత్రమేనని, పరస్పర ప్రేమ, గౌరవం ఉంటే చాలని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామంలో జరిగిన ఈ పెళ్లి ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.


Posted

in

by

Tags: