స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ఒక షాకింగ్ వార్త వెలువడింది. ఇండియాలో బడ్జెట్ మరియు మిడ్-రేంజ్ విభాగాలకు చెందిన మొబైల్ ఫోన్ల ధరలను ప్రస్తుతం భారీగా పెంచారు.
ప్రముఖ కంపెనీలైన శాంసంగ్ మరియు షావోమి (Xiaomi) తమ సెల్‌ఫోన్ల ధరలను 19 శాతం వరకు పెంచేశాయి. దీంతో మధ్యతరగతి ప్రజలు, సామాన్య కస్టమర్లు కాస్త ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తింది.
ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ర్యామ్ (RAM) కొరత, ఉత్పత్తి ఖర్చులు పెరగడం వంటి ప్రధాన కారణాల వల్లే ఈ ధరల పెంపును తీసుకొచ్చినట్లు సమాచారం.
ముఖ్యంగా, సుమారు 41 సెల్‌ఫోన్ల ధరలు రూ.1,000 నుంచి రూ.4,000 వరకు పెరిగాయి. దీంతో కొత్త ఫోన్ కొనాలనుకునే వారి బడ్జెట్ గణనీయంగా పెరిగే పరిస్థితి ఏర్పడింది.
కొత్త మొబైల్ కొనాలని ప్లాన్ చేసుకున్న చాలామందికి ఈ ధరల పెంపు అదనపు భారాన్ని మిగిల్చింది. రాబోయే రోజుల్లో ఇతర కంపెనీలు కూడా ఇదే తరహాలో ధరలు పెంచే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Leave a Reply