స్లీప్ టెర్రర్:చిన్నారి భయంతో ఏడుస్తోంది, కానీ ఎవరినీ గుర్తుపట్టలేకపోతోందా?.. తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన నిజం.!!!

పిల్లలు అర్ధరాత్రి అకస్మాత్తుగా భీతిల్లి అరవడం, ఉదయం లేచిన తర్వాత దాని గురించి వారికి ఏమీ గుర్తులేకపోవడం వంటివి చాలా మంది తల్లిదండ్రులను భయాందోళనకు గురిచేస్తుంటాయి.

దీనిని ‘స్లీప్ టెర్రర్’ (Sleep Terror) లేదా నిద్రలో కలిగే భయం అని పిలుస్తారు. ఈ అరుదైన నిద్ర రుగ్మత గురించి హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ నరాల నిపుణులు (Neurologist) డాక్టర్ సుధీర్ కుమార్ వివరించారు. సాధారణంగా 3 నుండి 12 ఏళ్ల మధ్య వయస్సు గల పిల్లలలో కనిపించే ఈ పరిస్థితి, గాఢ నిద్రలో ఉన్నప్పుడు సంభవిస్తుంది. మామూలు కలలలా కాకుండా, ఇందులో పిల్లలు కళ్లు తెరిచి ఉంచినా స్పృహలో ఉండరు. విపరీతంగా చెమటలు పట్టడం, వేగంగా గుండె కొట్టుకోవడం వంటి లక్షణాలతో వారు తీవ్రమైన భయంలో కనిపిస్తారు.

తల్లిదండ్రులు చేయాల్సినవి: ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండాలని డాక్టర్ సూచిస్తున్నారు.

  • బలవంతంగా నిద్రలేపవద్దు: బిడ్డ అరుస్తున్నప్పుడు వారిని బలవంతంగా నిద్రలేపడానికి ప్రయత్నించకండి, ఎందుకంటే అది వారిని మరింత గందరగోళానికి గురి చేస్తుంది.
  • రక్షణ కల్పించండి: బిడ్డ కింద పడిపోకుండా లేదా గాయపడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. వారు మళ్ళీ నిద్రపోయేలా నెమ్మదిగా సముదాయించాలి.
  • ముందస్తు జాగ్రత్త: ఒకవేళ మీ బిడ్డ ప్రతిరోజూ ఒకే సమయానికి ఇలా నిద్రలో భయపడుతుంటే, ఆ సమయానికి 15 నుండి 30 నిమిషాల ముందే వారిని లేపి, కాసేపు ఆగి మళ్ళీ నిద్రపుచ్చడం (Scheduled Awakening) వల్ల మంచి ఫలితం ఉంటుంది.

సరిపడా విశ్రాంతి మరియు సరైన సమయానికి నిద్రపోయేలా చూడటం వల్ల ఇటువంటి సమస్యలను తగ్గించవచ్చని ఆయన పేర్కొన్నారు.


Posted

in

by

Tags: