ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్‌లోని ఓ బాలికల వసతిగృహం (హాస్టల్) వాష్‌రూమ్‌లో రికార్డింగ్ మోడ్‌లో ఉంచిన మొబైల్ ఫోన్‌ను చూసి విద్యార్థినులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థినులు వెంటనే ఆందోళనకు దిగడంతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం హాస్టల్ మహిళా వార్డెన్‌పై కేసు నమోదు చేసి, ఆ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఆ మొబైల్లో ఏవైనా వీడియోలు రికార్డయ్యాయా, ఎప్పటి నుంచి ఇలా ఫోన్ ఉంచుతున్నారు అనే విషయాలను నిర్ధారించుకోవడానికి ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడవుతాయని పోలీసులు స్పష్టం చేస్తూ, ఈ ఘటనపై ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
