హెచ్చరిక: మాంసాహారులారా జాగ్రత్త: గొంతులో ‘చికెన్ ముక్క’ ఇరుక్కుని ఊపిరాడక వ్యక్తి మృతి.!

ఖర్జూరపు గింజ గొంతులో ఇరుక్కుని 42 ఏళ్ల వ్యక్తి మరణించిన సంఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా, అదే తరహాలో మరో వార్త వెలుగులోకి వచ్చింది. గొంతులో ‘చికెన్ ముక్క’ ఇరుక్కుని ఊపిరాడక ఒక వ్యక్తి మరణించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోడి మాంసం ముక్క గొంతులో ఇరుక్కుపోవడంతో ఓ ఆటో డ్రైవర్ మృతి చెందారు.

జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో ఆదివారం జరిగిన ఈ ఘటన స్థానికులలో తీవ్ర విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యుల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మృతుడు భార్య కవిత, ఇద్దరు కూతుళ్లను విడిచి వెళ్లారు.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గొల్లపల్లిలోని కేసీఆర్ డబుల్ బెడ్‌రూమ్ కాలనీకి చెందిన సురేందర్ (45) ట్రాలీ ఆటో నడుపుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.

ఆదివారం కావడంతో ఇంట్లో కోడి కూర వండుకుని తింటున్నారు. మధ్యాహ్నం ఇంట్లో అందరూ కలిసి భోజనం చేస్తుండగా, సురేందర్ గొంతులో కోడి ముక్క ఇరుక్కుపోయింది. దీని కారణంగా, ఆయనకు చాలాసేపు ఊపిరాడలేదు. చివరకు ఆయన ఊపిరాడక మరణించారు.


Posted

in

by

Tags: