సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉండటమే కాకుండా, గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. పొటాషియం, మెగ్నీషియం మరియు ఫైబర్ అధికంగా ఉండే అల్పాహారం తీసుకుంటే రక్తపోటును సమర్థవంతంగా నియంత్రించవచ్చు.
బీపీని నియంత్రించే అల్పాహారాలు:
- ఇడ్లీ: బియ్యం, మినపప్పుతో పులియబెట్టిన పిండితో చేసే ఇడ్లీలు సులభంగా జీర్ణమవుతాయి. తక్కువ ఉప్పు, తక్కువ నూనె ఉన్న సాంబార్‌తో తీసుకుంటే ఇది బీపీ ఉన్నవారికి మేలైన ఆహారం.
- ఓట్స్ దోశ: ఓట్స్‌లో కరిగే ఫైబర్ ఉంటుంది, ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించి రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఇందులో కూరగాయలు చేర్చుకుంటే మరింత పౌష్టికంగా మారుతుంది.
- ఉప్మా: రవ్వ ఉప్మాలో బీన్స్, టమోటా, బెల్ పెప్పర్స్ వంటి కూరగాయలు చేర్చి, తక్కువ నూనె మరియు తక్కువ ఉప్పుతో తయారు చేస్తే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.
- పోహా (అటుకులు): కూరగాయలతో చేసే అటుకులలో సోడియం తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. చివర్లో కొంచెం నిమ్మరసం కలుపుకుంటే రుచితో పాటు ఆరోగ్యం కూడా.
- రాగి జావ/అంబలి: రాగిలో కాల్షియం, పొటాషియం మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. మజ్జిగ, తక్కువ ఉప్పు కలిపిన రాగి జావ రక్తపోటును తగ్గిస్తుంది.
- పెసరట్టు/పెసలు: పెసలలో ప్రోటీన్ మరియు పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో సోడియం ప్రభావాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. దీనిని పుదీనా చట్నీ లేదా పెరుగుతో తీసుకోవచ్చు.
- బేసన్ చిల్లా (శనగపిండి దోశ): శనగపిండిలోని మెగ్నీషియం గుండెకు మంచిది. పాలకూర వంటి ఆకుకూరలు కలిపి తక్కువ నూనెతో దీనిని వేసుకోవచ్చు.
- మొలకెత్తిన గింజలు: వీటిలో ఫైబర్ మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఉప్పు లేకుండా దోసకాయ, టమోటా, నిమ్మరసం, మిరియాల పొడి కలిపి తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది.
- ఓట్ మీల్: కార్బోహైడ్రేట్లు మరియు ఫైబర్ ఇచ్చే ఓట్ మీల్ ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చేస్తుంది. పండ్లు లేదా పాలతో దీనిని తీసుకోవచ్చు.
- పెరుగు: తక్కువ కొవ్వు ఉన్న పెరుగులో ప్రోబయోటిక్స్ మరియు కాల్షియం ఉంటాయి. అరటిపండు, పప్పాయ లేదా ఫ్లక్స్ సీడ్స్‌తో కలిపి తీసుకుంటే ఆరోగ్యకరం.
