తమిళనాడులోని కరూర్‌లో ఒక హోటల్ యజమానిని మోసం చేసి, ఆయన నుండి ఖరీదైన కారును మరియు వజ్రాల ఆభరణాలను తీసుకెళ్లి, తిరిగి ఇవ్వకుండా ప్రాణహాని తలపెట్టిన ఘటన సంచలనం సృష్టిస్తోంది.
అసలేం జరిగిందంటే? చెన్నైలోని వలసరవాక్కం ప్రాంతానికి చెందిన రాణి బుల్లితెర (టీవీ) సీరియల్స్‌లో నటిగా పని చేస్తున్నారు. ఆమె భర్త బాలాజీ అలియాస్ బాలమురుగన్ ‘తమిళగ మక్కల్ మున్నేట్ర కళగం’ పార్టీలో నాయకుడిగా ఉన్నారు. బాలాజీ కరూర్-కోయంబత్తూర్ రోడ్డులోని ఒక హోటల్‌ను రూ. 10 లక్షలకు లీజుకు తీసుకున్నారు. అయితే, లీజుకు సంబంధించిన సొమ్మును హోటల్ యజమాని దినేష్‌కు ఆయన చెల్లించలేదని తెలుస్తోంది.
మోసం జరిగిన తీరు: గత నెల కరూర్‌కు వచ్చిన బాలాజీ, దినేష్‌కు చెందిన సుమారు రూ. 80 లక్షల విలువైన విదేశీ కారును రెండు నెలలు వాడుకుని తిరిగిస్తానని చెప్పి చెన్నైకి తీసుకెళ్లారు. ఆ కారులోనే దినేష్‌కు చెందిన 5 వజ్రాల కమ్మలు (Earrings) ఉన్నాయి. కొంతకాలం తర్వాత దినేష్ తన కారును, నగలను తిరిగి ఇవ్వాల్సిందిగా బాలాజీని కోరారు.
ప్రాణహాని బెదిరింపులు: అయితే, నటి రాణి, ఆమె భర్త బాలాజీ మరియు వారి బంధువు పురుషోత్తమన్ కలిసి కారును, నగలను తిరిగి ఇచ్చేది లేదని దినేష్‌ను బెదిరించారు. అంతేకాకుండా, దీని గురించి ఎక్కడైనా చెబితే చంపేస్తామని ప్రాణహాని తలపెట్టినట్లు బాధితుడు ఆరోపించారు.
పోలీసుల చర్యలు: దినేష్ ఫిర్యాదు మేరకు కరూర్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఒకరైన పురుషోత్తమన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న బాలాజీ కోసం గాలిస్తున్నారు. నటి రాణికి పోలీసులు సమన్లు పంపినప్పటికీ, ఆమె విచారణకు హాజరు కాలేదు.
