హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే మంచం కింద ఖాళీ వాటర్ బాటిల్ ఎందుకు వేయాలో తెలుసా? అసలు కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

మనం తరచూ ఉద్యోగ రీత్యా లేదా విహారయాత్రల కోసం వేర్వేరు నగరాలకు వెళ్తుంటాం. అలా వెళ్లిన ప్రతిచోటా మనకు తెలిసిన వారో, బంధువులో ఉంటారని చెప్పలేం. ఒకవేళ బంధువులు ఉన్నప్పటికీ, వారికి మన వల్ల ఇబ్బంది కలగకూడదని చాలా మంది భావిస్తారు.

అందుకే మనం ఊరు వెళ్లినప్పుడు బస చేయడానికి ఒక మంచి హోటల్‌ను ఎంచుకుంటాం. ఆ హోటల్ ఎంత బాగున్నప్పటికీ, అక్కడి సిబ్బంది అందించే సేవలు మెరుగ్గా ఉన్నప్పటికీ.. ఆ వాతావరణం మనకు పూర్తిగా కొత్తది. అందుకే ఆ హోటల్ గది భద్రతపై మన మనస్సులో ఎన్నో అనుమానాలు, ఆందోళనలు రేగుతుంటాయి. కొన్నిసార్లు కొత్త చోట మనకు అంతగా ప్రశాంతత లభించదు.

గతంలోనే మనం ఆ హోటల్‌లో బస చేసి ఉంటే పరిస్థితి వేరుగా ఉంటుంది, అక్కడి వాతావరణంపై మనకు పూర్తి అవగాహన ఉంటుంది. కానీ చాలా మంది ప్రయాణానికి ముందే ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని ఆన్‌లైన్‌లో హోటల్ రూమ్ బుక్ చేసుకుంటారు. అటువంటప్పుడు ఆందోళన మరింత ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే మనం ఆ హోటల్‌ను నేరుగా చూసి ఉండము. అక్కడ ప్రతిదీ మనకు కొత్తే.

మంచం కింద బాటిల్ ట్రిక్ – ఎయిర్ హోస్టెస్ సలహా
గతంలో కొన్ని హోటల్ గదుల్లో రహస్య కెమెరాలు (Hidden Cameras) అమర్చిన ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. దీనివల్ల ప్రయాణికుల వ్యక్తిగత భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అందుకే హోటల్‌లో బస చేసినప్పుడు మరింత అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. ఈ నేపథ్యంలోనే ఒక ఎయిర్ హోస్టెస్ హోటల్ భద్రతకు సంబంధించి తన అనుభవాన్ని, కొన్ని ముఖ్యమైన చిట్కాలను పంచుకుంది.

హోటల్ గదిలోకి ప్రవేశించగానే అందరికంటే ముందుగా మంచం (బెడ్) కింద ఒక ఖాళీ వాటర్ బాటిల్‌ను విసరాలని ఆమె సూచించింది. దానికి గల కారణాన్ని కూడా ఆమె వివరించింది. “మీరు ఖాళీ బాటిల్‌ను మంచం కిందకు విసిరినప్పుడు, అది ఎలాంటి అడ్డంకి లేకుండా అవతలి వైపు నుండి బయటకు వస్తే.. మంచం కింద ఎవరూ దాక్కోలేదని అర్థం. ఒకవేళ ఆ బాటిల్ అవతలి వైపునకు రాకుండా మధ్యలోనే ఆగిపోతే మాత్రం.. అక్కడ ఎవరో ఉన్నారని లేదా ఏదో దాచి ఉంచారని అనుమానించాల్సి ఉంటుంది” అని ఆమె పేర్కొంది.

అద్దాలను కూడా తనిఖీ చేయండి!
మంచం కింద మాత్రమే కాకుండా, హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే అక్కడ అమర్చిన అద్దాలను (Mirrors) కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆ ఎయిర్ హోస్టెస్ సలహా ఇచ్చింది. ఎందుకంటే సాధారణంగా ఇటువంటి అద్దాల వెనుకే రహస్య కెమెరాలను దాచే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆమె హెచ్చరించింది.


Posted

in

by

Tags: