గురుగ్రామ్ సైబర్ హబ్ సమీపంలో కారులో వెళుతున్న అన్నాచెల్లెళ్లను అడ్డుకున్న ఓ పోలీసు, దీపావళి కానుక ఇవ్వాలని బెదిరించిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.
కారులో ఉన్న దీపావళి గిఫ్ట్ హ్యాంపర్‌ను తనకు ఇచ్చేంత వరకు కారును వెళ్లనివ్వనని ఆ హోంగార్డు పట్టుబట్టినట్లు సమాచారం.
రక్షణగా ఉండాల్సిన ఓ యూనిఫాం అధికారి తన అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజల వద్ద బహుమతులు అడిగిన ఈ చట్టవిరుద్ధమైన చర్యను ఆ అన్నాచెల్లెళ్లు తమ సెల్ఫోన్లో వీడియో తీశారు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసి తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రజలు, నెటిజన్లు సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దీనిపై స్పందించిన గురుగ్రామ్ పోలీసులు, వైరల్ అయిన వీడియో ఆధారంగా విచారణ జరిపి, సంబంధిత హోంగార్డుపై కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply