హర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌లో, ఒక పారిశ్రామికవేత్తను ప్రేమలో దించి, బెదిరించి, దొంగ కేసులు పెడతానని భయపెట్టి పెళ్లి చేసుకున్న వర్ష అనే మహిళ గుట్టు ఒక్కొక్కటిగా రట్టవుతోంది.
మోసం మరియు భూ ఆక్రమణ ఫిర్యాదుల ఆధారంగా అరెస్టయిన వర్షపై, ఆమె భర్తలే అనేక తీవ్రమైన ఆరోపణలు చేశారు. విచారణలో, వర్ష మరియు ఆమె కుటుంబ సభ్యులపై వివిధ పోలీస్ స్టేషన్లలో సుమారు 13 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తేలింది.
ల్యాబ్ యజమాని సచిన్ సింగ్ రాజ్‌పుత్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో, వర్ష గురుగ్రామ్‌లోని తన ల్యాబ్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేసేదని తెలిపారు. ల్యాబ్ నగదు లావాదేవీలలో అక్రమాలు, అనుమానాస్పద కార్యకలాపాల కారణంగా సచిన్ ఆమెను ఉద్యోగం నుండి తొలగించారు. దీనికి ప్రతీకారం తీర్చుకునేందుకు, వర్ష సచిన్ మేనల్లుడిని తన వలలో వేసుకోవడమే కాకుండా, హోటల్లో సచిన్ ఐడెంటిటీ కార్డ్‌ని ఉపయోగించి నకిలీ పత్రాలను తయారు చేసి అతనిపై అపహరణ, లైంగిక వేధింపుల కేసులు నమోదు చేయించింది. దీనివల్ల సచిన్ 62 రోజులు జైలులో ఉండాల్సి వచ్చింది.
జైలు నుండి విడిపించడానికి, ఎఫ్.ఐ.ఆర్ రద్దు చేయడానికి ప్రతిఫలంగా నెలకు 15 లక్షల రూపాయల ఆదాయం ఇచ్చే ఆ ల్యాబ్ యాజమాన్య హక్కులను తన పేరిట మార్చాలని వర్ష షరతు విధించింది. అవమానం, సామాజిక ఒత్తిడి కారణంగా సచిన్ ఆమెను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. తరువాత పోలీసు విచారణలో సచిన్ నిర్దోషి అని నిరూపితం కావడంతో, వర్ష ఫిర్యాదు కొట్టివేయబడింది.
వర్ష మూడో భర్త సందీప్. ఈయన గురుగ్రామ్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా, వర్ష 2023లో తన కంపెనీలో రిసెప్షనిస్ట్‌గా చేరినట్లు తెలిపారు. వర్ష తనకు టీలో మత్తుమందు కలిపి ఇచ్చి, తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినట్లు సందీప్ ఆరోపించారు. 2023 జూన్‌లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు, కానీ వర్ష తన పూర్వపు రెండు పెళ్లిళ్ల గురించిన నిజాన్ని పూర్తిగా దాచేసింది. ఇంకా అనేకమంది యువకులపై లైంగిక వేధింపులు, అపహరణ వంటి కేసులను వర్ష నమోదు చేసినట్లు విచారణలో వెల్లడైంది.

Leave a Reply