పాకిస్థాన్ గుండెకాయ లాంటి ప్రాంతంలో 7 ఏళ్ల పాటు ఒక సామాన్య పౌరుడిలా జీవించి, ఆ దేశ సైన్యానికి సంబంధించిన అత్యంత కీలక రహస్యాలను భారత్కు చేరవేసిన ధీశాలి అజిత్ డోవల్.
ఉర్దూ భాషను మాతృభాషలా మాట్లాడుతూ, ప్రతిరోజూ మసీదుకు వెళ్తూ అక్కడి సైనిక అధికారులతో అత్యంత సన్నిహితంగా మెలిగారు. వారి నమ్మకాన్ని చూరగొని పాకిస్థాన్ సైన్యంలోని ప్రతి రహస్యాన్ని భారత్కు అందించారు. ఎటువంటి అనుమానం రాకుండా, ఆయనను పాకిస్థాన్లో ఒక భాగంగానే అక్కడి అధికారులు భావించారంటే, అది ఆయన గూఢచారి నైపుణ్యానికి నిదర్శనం.
అత్యంత భద్రత కలిగిన పాకిస్థాన్ అణుశక్తి కేంద్రం బయట ఒక భిక్షగాడి వేషంలో కూర్చుని, ఆ దేశ అణు కార్యక్రమాలకు సంబంధించిన రహస్యాలను ప్రపంచం ముందు ఉంచారు. పాకిస్థాన్ ఏమాత్రం పసిగట్టలేని విధంగా నిశ్శబ్దంగా భారతదేశానికి తిరిగి వచ్చిన ఆయన, నేడు భారతదేశ చరిత్రలో సుదీర్ఘ కాలం పాటు జాతీయ భద్రతా సలహాదారుగా (NSA) దేశాన్ని కాపాడుతున్నారు. గూఢచారిగా, వ్యూహకర్తగా, దేశభక్తుడిగా అజిత్ డోవల్ చేసిన ఈ సాహస యాత్ర ప్రపంచ నిఘా వర్గాలనే విస్మయానికి గురిచేసింది.
