దీపావళి పండుగ సందర్భంగా రిలయన్స్ జియో తన జియోహోమ్ (JioHome) కస్టమర్ల కోసం ఒక ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది.
ఈ ఆఫర్ ప్రకారం, 10 నెలల ఛార్జీలు చెల్లిస్తే అదనంగా 5 నెలల పాటు ఉచిత సేవలను పొందవచ్చు. అంటే, 10 నెలలకు డబ్బులు చెల్లించి మొత్తం 15 నెలల పాటు ఇంట్లో వైఫై, వినోద సేవలను వాడుకోవచ్చు. ఈ ఆఫర్‌కు ‘జియోహోమ్ ఫ్రీడమ్ ఆఫర్’ అని పేరు పెట్టారు.
ఈ ఆఫర్‌లో భాగంగా నెలకు రూ.666 చొప్పున 10 నెలలకు సుమారు రూ.6,660 చెల్లించాల్సి ఉంటుంది. దీనిద్వారా మొత్తం 15 నెలల పాటు సేవలు లభిస్తాయి. అయితే, ఇది జియో మొబైల్ ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ ఆఫర్ కాదు. కేవలం జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ ద్వారా అందించే జియోహోమ్ సేవలను వినియోగిస్తున్న అర్హులైన కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
ఈ ఆఫర్‌ను పొందాలనుకునే కస్టమర్లు తమ జియోహోమ్ కనెక్షన్‌తో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్ నుంచి 8219582195 అనే నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఆ తర్వాత జియో సంస్థ అదే నంబర్‌కు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ పంపుతుంది. అందులో పేర్కొన్న సూచనలను అనుసరించి ఆఫర్‌ను పొందవచ్చు. వేరే నంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇస్తే ఈ ఆఫర్ వస్తుందన్న గ్యారెంటీ లేదు. కాబట్టి, రీఛార్జ్ చేసుకునే ముందు మైజియో యాప్ లేదా జియో అధికారిక వెబ్‌సైట్‌లో అర్హత, నిబంధనలను చెక్ చేసుకోవడం ముఖ్యం.
కొత్త కస్టమర్ల కోసం కూడా జియో ఒక ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. దీనిప్రకారం, రెండు నెలల జియోహోమ్ ప్లాన్ తీసుకునే వారికి అదనంగా ఒక నెల సేవలను ఉచితంగా అందిస్తోంది. ఈ ప్లాన్ ధర రూ.2,122; గరిష్టంగా 100 ఎంబీపీఎస్ (Mbps) వేగంతో ఇంటర్నెట్ వాడుకోవచ్చు. జియోహోమ్ సేవల్లో వైఫై మాత్రమే కాకుండా, 15 భాషల్లో 1,000కి పైగా టీవీ ఛానెళ్లు, ఎంచుకున్న ప్లాన్‌ను బట్టి ఓటీటీ (OTT) యాప్‌ల సదుపాయాలు కూడా లభిస్తాయి.

Leave a Reply