భారత్ మరియు పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో, ఒక పాకిస్తానీ బాలుడు భారత కరెన్సీ అయిన 10 రూపాయల నోటు కోసం “భారత్ మాతా కీ జై” అని నినదించిన ఆసక్తికరమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించి, పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
సరిహద్దు ప్రాంతంలో వాహనంలో వెళ్తున్న ఒక భారతీయ యువకుడు, ముళ్లకంచెకు అవతలి వైపు ఉన్న పాకిస్తాన్ సరిహద్దులో గుర్రాల కోసం గడ్డి కోస్తున్న ముగ్గురు పిల్లలను తన మొబైల్ కెమెరాలో రికార్డ్ చేశాడు.
ఆ సమయంలో అక్కడున్న ఒక బాలుడిని కంచె వద్దకు పిలిచిన ఆ యువకుడు, “భారత కరెన్సీ 10 రూపాయలు ఇస్తాను, ‘భారత్ మాతా కీ జై’ అని నినాదం చేయి” అని అన్నాడు. ఇరు దేశాల మధ్య ఉన్న రాజకీయాలు, సరిహద్దు వివాదాల గురించి ఏమాత్రం తెలియని ఆ అమాయక పాకిస్తానీ బాలుడు, కేవలం 10 రూపాయల కోసం ఎంతో స్వచ్ఛమైన చిరునవ్వుతో, ముద్దుముద్దు మాటలతో “భారత్ మాతా కీ జై” అని నినదించాడు.
ఆ తర్వాత, “ఈ 10 రూపాయలతో ఏం చేస్తావు?” అని ఆ యువకుడు అడగ్గా, “ఆడుకుంటాను” అని ఆ బాలుడు అమాయకంగా సమాధానమిచ్చాడు. అంతటితో ఆగకుండా, ఆ యువకుడిని తెలివిగా మరో 20 రూపాయలు ఇవ్వాలంటూ చేయి చాచిన ఆ బాలుడి క్యూట్ వీడియో.. “పిల్లల మనసులకు సరిహద్దులు లేవు” (Children have no borders) అనే క్యాప్షన్‌తో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది.

Leave a Reply