ఆహార పదార్థాల తయారీలో వినియోగదారులను మోసం చేస్తున్న సంస్థలపై కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం కఠిన చర్యలు తీసుకుంటోంది.
ముఖ్యంగా, ఆరోగ్యకరమైన ఆహారం అని నమ్మి కొనుగోలు చేసే బ్రెడ్ వంటి ఉత్పత్తుల్లో జరుగుతున్న మోసాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి.
మార్కెట్లో విక్రయించే ఓ ప్రముఖ బ్రెడ్ ప్యాకెట్‌పై ‘100% వీట్ బ్రెడ్ (గోధుమ బ్రెడ్)’ అని, ‘0% మైదా’ అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీన్ని చూసి ప్రజలంతా ఇది పూర్తిగా గోధుమలతోనే తయారైందని నమ్మి కొనుగోలు చేసి వాడుతున్నారు.
కానీ, ప్రభుత్వ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఆ బ్రెడ్‌లో కేవలం 62% మాత్రమే గోధుమ పిండి ఉన్నట్లు తేలింది. ఆహార భద్రతా నిబంధనల ప్రకారం, ఒక ఉత్పత్తిని ‘గోధుమ ఉత్పత్తి’ అని చెప్పాలంటే అందులో కనీసం 75% గోధుమ పిండి ఉండాలన్నది గమనార్హం.
దీనిపై సదరు సంస్థను ప్రశ్నించగా, “మేము అందులో మైదా కలపలేదని చెప్పడానికే అలా ముద్రించాము” అని చాలా సింపుల్‌గా వివరణ ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ, వారి ఈ మోసపూరిత సమాధానాన్ని వినియోగదారుల హక్కుల కమిషన్, ఆహార భద్రతా విభాగం రెండూ అంగీకరించలేదు.
దీంతో, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటన చేసిన ఆ సంస్థకు ₹1 లక్ష జరిమానా విధించారు. అంతేకాకుండా, ఇలాంటి తప్పుదోవ పట్టించే ప్రకటనలను తక్షణమే అన్ని మాధ్యమాల నుండి తొలగించాలని కూడా కఠిన ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply