100 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం! పోలీస్ అడుగు కూడా పడని గ్రామం ఏదో తెలుసా? అక్కడ ఇన్ని కట్టుబాట్లు ఉన్నాయా?

తమిళనాడు మధురై జిల్లా కరుప్పయూరణి సమీపంలోని సక్కిమంగళం ప్రాంతంలో ‘ఒత్తవీడు’ (Othaveedu) అనే ఒక ప్రత్యేకమైన గ్రామం ఉంది. సుమారు వంద సంవత్సరాల క్రితం తిరుమంగళం నుండి వచ్చిన మూడు కుటుంబాలు ఈ ఊరిని ఏర్పరచాయి. నాటి నుండి నేటి వరకు ఈ గ్రామం అనేక ఆశ్చర్యకరమైన కట్టుబాట్లను పాటిస్తోంది.

ఈ గ్రామంలోని ఏ బహిరంగ ప్రదేశంలో గానీ, గోడల మీద గానీ రాజకీయ ప్రకటనలు చేయడానికి లేదా నోటీసులు అంటించడానికి ఎవరికీ అనుమతి లేదు. తమ ఊరి పరిశుభ్రతను, ప్రశాంతతను కాపాడటం కోసం పూర్వీకులు విధించిన ఈ నిబంధనను నేటి యువతరం కూడా ఒక సంప్రదాయంగా గౌరవిస్తూ వస్తోంది.

ఈ గ్రామం యొక్క మరో విశిష్టత ఏమిటంటే.. ఇక్కడి ప్రజలు తమ మధ్య తలెత్తే కుటుంబ సమస్యలు లేదా సాధారణ గొడవలను ఎప్పుడూ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లరు. గ్రామం ముఖద్వారంలో ఉన్న రావిచెట్టు కింద పెద్దల సమక్షంలో మాట్లాడుకుని సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటారు.

దీనివల్ల వంద ఏళ్ల చరిత్రలో ఇప్పటివరకు ఒక్క పోలీసు అధికారి కూడా విచారణ నిమిత్తం ఈ ఊరిలోకి అడుగు పెట్టాల్సిన అవసరం రాలేదు. ఐకమత్యమే మహాబలం అని చాటిచెబుతున్న ఈ గ్రామం యొక్క క్రమశిక్షణ, ఆధునిక కాలంలో కూడా మారకుండా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.


Posted

in

by

Tags: